Begin typing your search above and press return to search.

ఆ టూపీస్ 50 గ్రాములు అయినా లేద‌ని క‌ల‌త‌!

By:  Tupaki Desk   |   11 Jan 2022 11:30 AM GMT
ఆ టూపీస్ 50 గ్రాములు అయినా లేద‌ని క‌ల‌త‌!
X
టూపీస్ ల‌తో చెల‌రేగ‌డం దిశా ప‌టానీకి కొత్తేమీ కాదు. ఇంత‌కుముందే సీకే బ్యూటీగా యూత్ గుండెల్ని కొల్ల‌గొట్టింది. గోవా బీచ్.. మాల్దీవుల సెల‌బ్రేష‌న్స్ నుంచి దిశా అన్ లిమిటెడ్ బోల్డ్ బికినీ ట్రీట్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. అయితే ప్ర‌తిసారీ హ‌ద్దుమీరి చెల‌రేగిపోతున్న ఈ బ్యూటీకి అనూహ్యంగా చీవాట్లు త‌ప్ప‌డం లేదు. ఇటీవ‌ల‌ కొన్ని బోల్డ్ స్నాప్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చాలా ప్రశంసలు అందుకుంది దిశా. ప్ర‌శంస‌ల‌తో పాటు ట్రోల్స్ ని కూడా అంతే విరివిగా ఎదుర్కొంది.

తన వీపందాన్ని ఆవిష్క‌రిస్తూ అర్థ‌న‌గ్నంగా బీచ్ లో నిలుచుకుని దిశా క‌నిపించిన తీరుకు కుర్ర‌కారు టెంప్ట్ అయ్యారు. బోల్డ్ బికినీ లుక్ క్ష‌ణాల్లోనే అంత‌ర్జాలాన్ని చుట్టేసింది. అభిమానులు వైర‌ల్ గా షేర్ చేశారు. అయితే దిశాను ఇంత‌ బోల్డ్ పోజ్ లో చూసిన కొంద‌రు బాగా తిట్టారు కూడా.``జ‌నం దృష్టిని ఆకర్షించడానికి ఇంత దిగజారిపోతారని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె కేవలం n*de ఫోటోనే ఇచ్చింది`` అంటూ విమ‌ర్శించాడు ఒక నెటిజ‌న్. ``దిశా సహజంగానే చాలా అందంగా ఉంది, అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేందుకు ఇలా అర్ధనగ్నంగా పోజులివ్వాలని ఆమె ఎందుకు అనుకుంటుందో నాకు అర్థం కాదు`` అని మరొక నెటిజన్ రాశారు. ``కొత్త తరం గురించి కొంచెం ఆలోచించండి. తక్కువ బట్టలు లేకుండా మీరు ఫోటోలు దిగ‌రు. గుర్తింపు కావాలనుకుంటే అలాంటి చిత్రాల ద్వారా కాకుండా మీ పని ద్వారా ప్రజలు మిమ్మల్ని గుర్తించేలా చేయాలి`` అని ఇంకొకరు వ్యాఖ్యానించారు.

దిశా ప‌టానీ ఈ ఫోటోషూట్ లో కేవ‌లం అతి ప‌లుచ‌ని పింక్ క‌ట్ పీస్ ల‌ను మాత్ర‌మే ఒంటిపై ధ‌రించ‌డంతోనే ఇలా నెటిజ‌నుల‌కు కోపం వ‌చ్చింది. క‌నీసం ఆ రెండు పీస్ ల బ‌రువు 50గ్రాములు అయ‌నా లేద‌నేది ఎక్కువ మందిని క‌ల‌త‌కు గురి చేసింది.

దిశా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో న‌టిస్తున్న యాక్షన్-డ్రామా `యోధ` షూటింగ్ ను పూర్తి చేసింది. సినిమా సెట్‌లో చిత్రీకరించిన చమత్కారమైన వీడియోతో దిశా పటాని ఈ విష‌యాన్ని ధృవీకరించారు. తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో పంచుకున్న వీడియోలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి `హూ సెక్సీ ఐయామ్ సెక్సీ` సాంగ్ లో న‌ర్తిస్తూ క‌నిపించింది. వీడియో క్లిప్ ను పంచుకుంటూ దిశా ఇలా రాసింది, `` ఇట్స్ ఎ ర్యాప్ప్ప్ #యోధ @సిద్ధార్త్ మ‌ల్హోత్రా`` అంటూ వ్యాఖ్య‌ను జోడించింది. దిశా- సిద్ధార్థ్ లతో పాటు ఈ చిత్రంలో రాశి ఖన్నా కూడా ప్రధాన పాత్రలో నటించారు.