Begin typing your search above and press return to search.

CK బ్యూటీపై ఫ్లాష్ క‌ళ్లు చెద‌రగొట్టిందే..!

By:  Tupaki Desk   |   16 Oct 2021 7:13 AM GMT
CK బ్యూటీపై ఫ్లాష్ క‌ళ్లు చెద‌రగొట్టిందే..!
X
`లోఫ‌ర్` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది దిశాప‌టానీ. కానీ అమ్మ‌డికి తొలి సినిమా చేదు అనుభ‌వాన్నే మిగిల్చింది. ఎన్నో ఆశ‌ల‌తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టినా..డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో క‌లిసి ప‌నిచేసినా దిశ కెరీర్ ట‌ర్న్ తీసుకోలేదు. అటుపై ఇక్క‌డ అవ‌కాశాలొచ్చినా న‌టించ‌లేద‌ని ప్ర‌చార‌మైంది. అయితే బాలీవుడ్ లో ప్ర‌య‌త్నాలు చేసి స‌క్సెస్ అయింది దిశ‌. ధోనీ బ‌యోపిక్ తో పాటు..`కుంగ్ ఫూ యోగా`..`వెల్క‌మ్ న్యూయార్క్`..`భాఘీ-3`..`భాఘీ-3 `చిత్రాల్లో న‌టించి బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు అందుకుంది. ఇటీవ‌ల స‌ల్మాన్ భాస్ స‌ర‌స‌న వ‌ర‌స చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుంది. ప్ర‌స్తుతం దిశ కెరీర్ బాలీవుడ్ లో తిరుగు లేకుండా సాగిపోతోంది. ప్ర‌స్తుతం చేతిలో నాలుగైదు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉంది.

ఇలా సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా అమ్మ‌డు సోష‌ల్ మీడియాల్ని మాత్రం విడిచిపెట్ట‌దు. ఇన్ స్టాలో అంతే యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త టెంప్టింగ్ ఫోటోల‌తో కాక‌లు పుట్టించ‌డం దిశ ప్ర‌త్యేక‌త‌. ఇప్ప‌టికే ఇన్ స్టా వేదిక‌గా చాలా సంద‌ర్భాల్లో అందాలు ఆర‌బోసిన దిశా సీకే బ్రాండ్ ప్ర‌మోట‌ర్ గా పాపుల‌రైంది. లోదుస్తుల ప్ర‌చారంలో దిశ ఇత‌రుల‌కు స్ఫూర్తిగా నిలిచింది. ఇక దిశా ఇప్పుడు మ‌రోసారి ఒక రేంజులో అభిమానుల ముందుకొచ్చింది. ఇదిగో ఇలా సూర్య కిర‌ణంలా .. నియాన్ లైట్ ఫ్లాష్ లా ధ‌గ‌ధ‌గ‌లు దిశ మెడ‌పై వాలి ప్ర‌త్యేక‌మైన మెరుపును షేడ్ ను తీసుకొచ్చిన ఫోటో ఆక‌ట్టుకుంటోంది. ర‌వివ‌ర్మ‌కే అంద‌ని అందానివా? అంటూ ... తొలి కిర‌ణం ప‌రుచుకునే వేళ‌ ఇలా హాటెస్ట్ ఫోటో సెష‌ల్ లో పాల్గొంది. మెరిసే లైట్నింగ్ మెరుపుల‌ న‌డుమ ఇలా త‌న‌దైన అందం ప‌రిచేస్తూ మంత్ర‌ముగ్దుల్ని చేస్తోంది. దిశ మెడ మీదుగా కాంతిని ఇలా ప్ర‌స‌రింపజేయ‌డం సృజ‌నాత్మ‌క‌త‌కు అద్దం ప‌ట్టింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైల‌ర్ గా మారింది. దిశ ఫాలోవ‌ర్స్ జోరుగా వ్యాఖ్య‌ల్ని జోడిస్తూ అభిమానం చాటుకుంటున్నారు. ప్ర‌స్తుతం దిశా ప‌టానీ ప్ర‌ధాన పాత్ర‌లో `టీనా` అనే చిత్రం తెర‌కెక్క‌కుతోంది. అలాగే మోహిత్ సూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `ఏక్ విల‌న్ రిట‌ర్న్స్ ` లోనూ న‌టిస్తోంది. ఇందులో జాన్ అబ్ర‌హం...అర్జున్ క‌పూర్ హీరోలుగా న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం విడుద‌ల కానుంది.