Begin typing your search above and press return to search.

వీడియో: నిత్యం వెర్రి షాపింగ్ ఆలోచ‌న‌ల‌తో CK బ్యూటీ చివ‌రికిలా!

By:  Tupaki Desk   |   8 April 2021 6:05 AM GMT
వీడియో: నిత్యం వెర్రి షాపింగ్ ఆలోచ‌న‌ల‌తో CK బ్యూటీ చివ‌రికిలా!
X
సీకే బ్యూటీ దిశాప‌టానీ సోషల్ మీడియా ప్ర‌మోష‌న్స్ గురించి తెలిసిందే. ఈ భామకు ఇప్ప‌టికే ఇన్ స్టా.. ట్విట్ట‌ర్ వేదిక‌గా భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇక ఇటీవ‌ల ఫేస్ బుక్ లోనూ ఈ అమ్మ‌డు అసాధార‌ణంగా ఫాలోయింగ్ ని పెంచుకునే ప‌నిలో ఉంది.

తాజాగా దిశా ప‌టానీ ఎఫ్ బీలో షేర్ చేసిన ఓ ఫ‌న్నీ వీడియో ఫ‌క్కున న‌వ్వుకునేలా చేస్తోంది. ఈ వీడియోలో ఆంగ్ల వ్యాఖ్యానం మిన‌హాయిస్తే దిశా ప‌టానీ అలా ప‌డీ ప‌డీ న‌వ్వేస్తూ ర‌క‌ర‌కాల ఎక్స్ ప్రెష‌న్స్ తో నానా హంగామా సృష్టిస్తున్న తీరు వ్యూయ‌ర్స్ ని న‌వ్వుకునేలా చేస్తోంది. నిత్యం షాపింగ్ ఆలోచ‌న‌ల‌తో పిచ్చెక్కి చివ‌రికిలా అవుతారు! అంటూ ఈ వీడియోకి దిశా ఒక ఆస‌క్తిక‌ర‌ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ వీడియో ఎఫ్ బిలో జోరుగా వైర‌ల్ అవుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. టైగర్ న‌టించిన బాఘి 3 లో దిశా ఒక ఐటెమ్ నంబ‌ర్ లో క‌నిపించింది. ఇందులో శ్రద్ధా కపూర్ - రితీష్ దేశ్ ముఖ్ లతో కలిసి టైగ‌ర్ నటించారు. దిశా న‌టించిన రాధే ఈద్ కానుక‌గా రిలీజ్ కావాల్సి ఉండ‌గా సెకండ్ వేవ్ ప్ర‌భావంతో ఏం జ‌రుగుతోందో అర్థం కాని ప‌రిస్థితి. మ‌రోవైపు మాజీ ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్ ప‌లు భారీ చిత్రాల‌తో బిజీగా ఉండ‌గా దిశాకు వీటిలో అవ‌కాశం క‌ల్పించ‌నున్నాడ‌ని తెలిసింది.