Begin typing your search above and press return to search.

ఐటెమ్ పోరీగా దిశా?

By:  Tupaki Desk   |   7 Jan 2016 5:47 AM GMT
ఐటెమ్ పోరీగా  దిశా?
X
పూరి తీసిన లోఫ‌ర్‌ తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది దిశాప‌టానీ. మొద‌ట్లో ఆమెని అంద‌రూ రెండో ఇలియానా అన్నారు. ఆ మాట విని దిశా కూడా ఖుషీ అయ్యుంటుంది. కొన్ని క‌ల‌లు కూడా క‌నుంటుంది. లోఫ‌ర్ స‌క్సెస్ అయ్యుంటే నిజంగానే ఇలియానా 2 అని పిలిచేవారేమో తెలియ‌దు కానీ... ఆ చిత్రం కాస్త పరాజయాన్ని చ‌విచూసింది. దీంతో దిశా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ని పెద్ద‌గా ప్ర‌భావితం చేయ‌లేక‌పోయింది. అయితే మెగా హీరో స‌ర‌స‌న న‌టించింది కాబ‌ట్టి ఆమెకి క్రేజీ ఆఫ‌ర్లు రావొచ్చేమో అని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి. పైగా సినిమాలో ఆమె అందాలు బాగా ఆర‌బోసింది. ఒక పాట‌లో కుర్ర‌కారుని కిక్కెక్కించింది. అందుకే దిశా మ‌ళ్లీ మెరుస్తుందని అంచ‌నా వేశారు.

కానీ దిశా అందాల్ని మ‌న సినీ జ‌నాలు మ‌రో యాంగిల్‌ లో చూసిన‌ట్టున్నారు. అందుకే ఆమెని హీరోయిన్‌ గా కాకుండా ఐటెమ్ పాట‌ల‌కి ఎంచుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇటీవ‌ల స‌రైనోడు సినిమాలో ఓ ఐటెమ్ పాట చేయ‌మ‌ని దిశాప‌ఠానీని సంప్ర‌దించార‌ట‌. మొద‌ట్లో ఆ పాట కోసం అంజ‌లి - అనుష్క పేర్లు వినిపించాయి. అయితే లోఫ‌ర్‌ లో దిశా చేసిన సంద‌డిని చూశాక చిత్ర‌బృందం నిర్ణ‌యం మార్చుకుంద‌ట‌. దిశాలాంటి నాజూకు భామ ఐటెమ్ పాట‌లో క‌నిపిస్తే వ‌చ్చే మ‌జానే వేర‌ని అల్లు అర్జున్ అభిప్రాయ‌ప‌డ్డాడ‌ట‌. సో... దిశానే సెలెక్ట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం సాగుతోంది.