Begin typing your search above and press return to search.

బన్నికి లైనేస్తున్న కొత్త పోరి

By:  Tupaki Desk   |   7 July 2015 6:44 AM
బన్నికి లైనేస్తున్న కొత్త పోరి
X
టాలీవుడ్‌కి కొత్త పోరి వస్తోంది. ముంబై నుంచి నేరుగా దిగిపోతోంది. వస్తూనే మెగా హీరో వరుణ్‌తేజ్‌కి హీరోయిన్‌ అయిపోతోంది. టాలీవుడ్‌ని తనదైన విన్యాసాలతో షేకాడించేస్తానని చెబుతోంది. అంతేనా బన్నీ లాంటి హీరో ఓ ఛాన్సిస్తే లెగ్గు లెగ్గు కలిపేసి షేకాడించేస్తానంటోంది. బన్నిని చూసి ఎప్పుడో మనసు పారేసుకున్నా. అతడి సరసన కథానాయికగా నటించాలనుకున్నా. కనీసం అతడితో కలిసి ఓ ఐటెమ్‌లో స్టెప్పులేసే ఛాన్సొచ్చినా చాలు.. అంటూ మనసులోని కోరికను బైటికే చెప్పేసింది. బన్నీకి వీరాభిమానిని అంటూ హొయలుపోతున్న ఈ బేబీ ఎవరండీ ఇంతకీ??

ఈవిడ పేరు దిషా పటాని. ముంబై మోడల్‌. అక్కడ 'భాగి' అనే చిత్రంలో టైగర్‌ ష్రాప్‌ సరసన నాయికగా నటిస్తోంది. అంతేనా ఉత్తరాదిన ప్రాజెక్టుకు సంతకం చేయక ముందు నుంచీ మన వాళ్లకు టచ్‌లో ఉంది. ముఖ్యంగా స్పీడ్‌ డైరెక్టర్‌ పూరీతో రెండేళ్ల నుంచి టచ్‌లోనే ఉంది ఈ అమ్మడు. ఇంతకుముందే ఓ సినిమాలో నటించాల్సింది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు వరుణ్‌తేజ్‌ సరసన పూరీ ఛాన్సిచ్చారు. తెలుగులో నిరూపించుకుంటానని చెప్పింది. వరుణ్‌-పూరి కలయికలోని సినిమా మరో వారంలో ప్రారంభం కానుంది. మరి బన్నీని ఓ రేంజులో పొగిడేసింది కాబట్టి పిలిచి ఓ ఛాన్సిస్తాడంటారా?