Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: పొట్టి గౌన్ లో కిల్లర్ బ్యూటీ

By:  Tupaki Desk   |   30 March 2020 12:10 PM GMT
ఫోటో స్టోరీ: పొట్టి గౌన్ లో కిల్లర్ బ్యూటీ
X
మన దేశంలో ఎంతో మంది హాటు భామలు ఉంటారు కానీ వారిలో దిశా పటాని రూటే సెపరేటు. మోసగాళ్ళకు మోసగాడు టైపులో హాటు బ్యూటీలకే హాటు బ్యూటీ దిశ. పాపకు ఇన్నర్ వేర్ తప్ప మిగతా వేర్ ఏది ఒంటిపై ఎక్కువసేపు నిలవదు. మరీ ముఖ్యంగా కెమెరాలను చూస్తే చాలు దిశాలోని హాటు అపరిచితురాలు బయటకు వచ్చేస్తుంది. ఇలా ఎన్నోసార్లు అలా జరగడం తో సోషల్ మీడియాలో వేలకొద్ది సునామీలు వచ్చాయి.

ఈ భామ తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు కానీ రెండు పువ్వు బొమ్మలను పెట్టింది. లాక్ డౌన్ కావడంతో అవుట్ డోర్ లో కాకుండా తన ఇంట్లోనే.. ఇంటి బాల్కనీలోనే ఫోటోలు తీయించుకుంది. లైట్ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ ఉన్న ఓ చిట్టి పొట్టి గౌన్ ధరించి తనకు అలవాటైన రీతిలో నిలుచుంది. నిగనిగలాడుతున్న చర్మ సౌందర్యం.. నవనవలాడుతున్న మేని లావణ్యంతో అందానికి కేరాఫ్ అడ్రెస్ లాగా కనిపిస్తోంది. సాధారణంగా అయితే ఇన్నర్ వేర్ జింతాత ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ లేదు. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత తనలోని మాసును నైసుగా బయటకు తీస్తుందేమో వేచి చూడాలి.

ఈ ఫోటోలకు ఎప్పటిలాగానే భారీ స్పందన దక్కింది. 1.6 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇక కామెంట్లకు కూడా లెక్కే లేదు. "టైగర్ భాయ్ ఫోటోగ్రాఫరా?".. "కిల్లర్ బ్యూటీ".. "సీకె కహాఁ హై" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. దిశ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ 'రాధే' సినిమాలో నటిస్తోంది.