Begin typing your search above and press return to search.

కొత్త పిల్ల కత్తిలా ఉందే..

By:  Tupaki Desk   |   17 Dec 2015 10:44 AM GMT
కొత్త పిల్ల కత్తిలా ఉందే..
X
ఇండస్ట్రీలోకి ఒక కొత్త హీరో వచ్చాడంటే... నటన కంటే కూడా అతను డ్యాన్సులెలా చేశాడు, ఫైట్లు ఎలా చేశాడు అనే చూస్తారు జనాలు. అలాగే హీరోయిన్ల విషయంలోనూ కొన్ని యాంగిల్స్ చూస్తారు. నటన కంటే కూడా ‘గ్లామర్’ మీదే అందరి దృష్టి నిలిచి ఉంటుంది. అమ్మాయి అందంగా ఉందా లేదా.. స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది.. ఒంపసొంపుల మాటేంటి? గ్లామర్ బాగానే ఒలకబోసిందా? పెద్ద హీరోల పక్కన సెట్టవుతుందా? అని చూస్తారందరూ. ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన హీరోయిన్లలో అత్యంత ఆసక్తి రేపిన అమ్మాయి దిశా పటాని. ఈ రోజే ఆమె తొలి సినిమా ‘లోఫర్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

లోఫర్ పోస్టర్లలోనే ఆకట్టుకున్న దిశా పటాని.. సినిమాలో కూడా అంచనాలకు తగ్గట్లే ఉంది. యాక్టింగ్ స్కిల్స్ గురించి చెప్పుకోవడానికేమీ లేదు కానీ.. అమ్మాయి లుక్స్.. గ్లామర్ విషయంలో ఢోకా ఏమీ లేదు. బాలీవుడ్ హీరోయిన్లకు దీటుగా పర్ఫెక్ట్ ఫిగర్ తో కుర్రాళ్లకు బాగానే వల విసిరింది దిశా. ఓ పాటలో ఆమె అందాల్ని ఎరోటిగ్గా చూపించాడు పూరి. దిశా వర్షంలో నేలమీద వయ్యారంగా పడుకుని ఇచ్చిన పోజుకు ఎవ్వరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఇక వరుణ్ తో కలిసి బెడ్డు మీద శృంగారం ఒలికించే సీన్లో కూడా చెలరేగిపోయింది దిశా. మొత్తానికి కావాల్సినన్ని అందాలున్నాయి. వాటిని ప్రదర్శించే విషయంలో మొహమాటాలు కూడా ఏమీ ఉన్నట్లు లేవు కొత్త పిల్లకు. మొత్తానికి తొలి సినిమాతోనే కత్తిలా ఉంది అనిపించుకున్న దిశాకు ఆఫర్ల విషయంలో లోటేమీ ఉండకపోవచ్చు.