Begin typing your search above and press return to search.

పూరి హీరోయిన్‌ కి బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   5 Jan 2016 9:30 AM GMT
పూరి హీరోయిన్‌ కి బంపర్ ఆఫర్
X
‘లోఫర్’ సినిమాలో పూరి డైరెక్షన్ స్కిల్స్ కంటే కూడా అతను హీరోయిన్ దిశా పఠానిని చూపించిన స్టయిల్ ఎక్కువ చర్చనీయాంశమైంది. సినిమా ఫ్లాప్ అయితే అయింది కానీ.. దిశాకు మాత్రం మంచి పేరే వచ్చింది. కెరీర్ కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచి స్థాయికి వెళ్లే ఫీచర్స్ అమ్మడిలో ఉన్నట్లే కనిపించాయి. ఐతే ‘లోఫర్’ తర్వాత ఇప్పటిదాకా తెలుగులో ఇంకో ఛాన్స్ అయితే అందుకోలేదు దిశా. కానీ ఆమెకు బాలీవుడ్ నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎంఎస్ ధోని’ సినిమాలో ఆమె ఓ హీరోయిన్‌ గా ఎంపికైందట.

దిశా ఇందులో పోషించబోయే పాత్ర గురించి బాలీవుడ్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ధోని నిజ జీవితంలో డేటింగ్ చేసిన అమ్మాయి పాత్ర ఇదని అంటున్నారు. ఐతే ధోని కెరీర్ ఆరంభంలో దీపికా పదుకొనేతో సయ్యాటలు ఆడినట్లు రూమర్లున్నాయి. అంతే కాక సౌత్ ఇండియన్ హాట్ గర్ల్ లక్ష్మీరాయ్ తో కూడా ఎఫైర్ నడిపినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. మరి దిశా పోషిస్తున్న పాత్ర ఏదో చూడాలి మరి. జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ తో ఎఫైర్ సాగిస్తున్న దిశా.. అతడి ద్వారానే ఈ ఆఫర్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెడ్నస్ డే - స్పెషల్ చబ్బీస్ - బేబీ లాంటి సెన్సేషనల్ మూవీస్ తీసిన నీరజ్ పాండే ‘ఎంఎస్ ధోని’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సుశాంత్ రాజ్ పుత్ ధోని పాత్రలో నటిస్తున్నాడు.