Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మరో దిశా పటానిలా ఉందే!

By:  Tupaki Desk   |   10 July 2019 7:53 AM GMT
ఫోటో స్టొరీ: మరో దిశా పటానిలా ఉందే!
X
లేఖ ప్రజాపతి పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. అయితే అదంతా గతం. లేఖ 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో బోనాలు సాంగ్ లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది కాబట్టి ఇకపై లేఖ అనగానే ఇస్మార్ట్ బ్యూటీ అని గుర్తుపట్టేస్తారు. అయినా పూరి సారు ఒక భామను లాంచ్ చేస్తున్నారంటేనే ఆ బ్యూటీలో ఏదో టాలెంట్ ఉన్నట్టు. అప్పట్లో అయన 'లోఫర్' తో దిశా పటాని ని లాంచ్ చేసినప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ తర్వాత దిశా సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ లేఖ పాప వాలకం చూస్తుంటే అలానే ఉంది.

రీసెంట్ గా లేఖ ప్రజాపతి చేసిన ఫోటో షూట్ స్టిల్స్ బైటకు వచ్చాయి. అందులో ఒకటి 'లడ్డూ కావాలా నాయనా' అన్నట్టుగా ఉంది. పింక్ కలర్ స్వెట్ షర్ట్ ధరించిన లేఖ తన అందాలను కళాత్మకంగా వడ్డిస్తూ పోజిచ్చింది. మొహంపై పడుతున్న పడుతున్న ముంగురులు.. మేని రంగుతో కలిసి పోయిన రోజారంగు దుస్తులు.. లేఖ కళ్ళలో ఉన్న ఒకలాంటి మెరుపు నెటిజన్లను పిచ్చెక్కించేలా ఉంది.

ఈ ఫొటోనే కాదు లేఖ ఇన్స్టా ఖాతాలో మంటలు రేపే ఫోటోలు ఇంకా ఉన్నాయి. పాప గ్లామర్ బౌలింగ్ ఇప్పుడే మొదలెట్టింది కదా.. త్వరలోనే నెటిజన్ల వికెట్లు టపటపా పడిపోతాయి. అనుమానం లేదు. ఒకవేళ యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉంటే టాలీవుడ్ కు మరో హాటు సుందరి వచ్చేసినట్టే.