Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్‌ తండ్రి నెగటివ్‌

By:  Tupaki Desk   |   7 Aug 2020 5:00 PM IST
ఆ హీరోయిన్‌ తండ్రి నెగటివ్‌
X
వరుణ్‌ తేజ్‌ కు జోడీగా ‘లోఫర్‌’ చిత్రంలో నటించిన దిశా పటానీ ఆ తర్వాత బాలీవుడ్‌ లో ఫుల్‌ బిజీ అయ్యింది. అయినా కూడా ఈమె గురించి సౌత్‌ లో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటూనే ఉంది. ఇటీవల ఈమె తండ్రి జగదీష్‌ పటానీ కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందని యూపీకి చెందిన ఈయన కొన్ని రోజుల క్రితం క్నో వెళ్లగ అక్కడ కరోనా సోకిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విజులెన్స్‌ డిపార్ట్‌ మెంట్‌ లో ఉద్యోగం నిర్వహిస్తున్న జగదీష్‌ కు సంబంధించిన వార్త ఒక్కసారిగా సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాకింది.

జగదీష్‌ పటానీ కరోనా పాజిటివ్‌ అంటూ వచ్చిన వార్తలు నిజం కాదంటూ దిశా పటానీ టీం క్లారిటీ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో ఈ వార్త ఎలా మొదలయ్యిందో కాని ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆయన ఉన్నారంటూ దిశా పటానీ సోషల్‌ మీడియా టీం క్లారిటీ ఇచ్చింది.

దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా దూసుకు పోతుంది. మరో వైపు ఈమె బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ తో సహజీవనం సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇద్దరు కూడా అధికారికంగా క్లారిటీ ఇవ్వకున్నా అదే నిజం అంటూ బాలీవుడ్‌ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.