Begin typing your search above and press return to search.

వీడియో: సీకే బ్యూటీ కిరాక్ డ్యాన్సులు

By:  Tupaki Desk   |   24 April 2020 4:30 AM GMT
వీడియో: సీకే బ్యూటీ కిరాక్ డ్యాన్సులు
X
క‌మిట్ మెంట్ అంటే దిశా.. దిశా అంటే క‌మిట్ మెంట్. అందుకే ఈ అమ్మ‌డికి అంత ఫాలోయింగ్. సీకే బ్రాండుకి ప్ర‌మోష‌న్ చేసినా.. పెద్ద తెర‌పై అలుప‌న్న‌దే లేకుండా ఎక్స్ పోజింగుతో హొయ‌లు ఒలికించినా నూటికి 200శాతం ఇన్వాల్వ్ మెంట్ చూపిస్తుంది. అందుకే దిశాకు యూత్ లో అంతే ఇదిగా ఫాలోయింగ్ ఉంటుంది.

గ‌త కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాల్లో ఈ అమ్మ‌డిని ల‌క్ష‌లాది మంది ఫాలోవ‌ర్స్ వెంబ‌డిస్తున్నారంటే త‌న ట్యాలెంట్ ని గుర్తించారు కాబ‌ట్టే. ఇక ట్విట్ట‌ర్.. ఇన్ స్టాలో దిశా ప‌టానీ ఫోటోలు వీడియోల‌కు అంతే గొప్ప మైలేజ్ ఉంది. అందుకే ప్ర‌ఖ్యాత కెల్విన్ క్లెయిన్ ఈ అమ్మ‌డిని బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఎంపిక చేసుకుని ఏడాదిన్న‌ర కాలంగా తెగ ప్రమోష‌న్ చేసుకుంటోంది. సీకే బ్రాండ్ ఇట్టే యూత్ కి ఎక్కేసిందంటే అది దిశా చ‌లువేన‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

ఓవైపు మెయిన్ స్ట్రీమ్ నాయిక‌గా కొన‌సాగుతూనే అప్పుడ‌ప్పుడు ఐటెమ్ నంబ‌ర్ల‌తోనూ ఇర‌గ‌దీస్తోంది. స‌ల్మాన్ భాయ్ `భార‌త్` చిత్రంలో దిశా రోల్ కి ఏ రేంజులో పాపులారిటీ ద‌క్కిందో తెలిసిందే. ఇటీవ‌లే మాజీ ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన భాఘి 3లోనూ దిశా ట్రీట్ అదిరిపోయింద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. `డు యు ల‌వ్ మి` అంటూ దిశా స్పెష‌ల్ సాంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్ కి కిక్కు పెంచింది. అయితే ఈ సాంగ్ మేకింగ్ కి సంబంధించిన ఓ ఎక్స్ క్లూజివ్ క్లిప్ ని తాజాగా ఇన్ స్టాగ్ర‌మ్ ద్వారా ఫ్యాన్స్ కి షేర్ చేసింది దిశా ప‌టానీ. ఈ క్లిప్ లో డ్యాన్స్ మూవ్స్ కిర్రాక్ పుట్టిస్తున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. ఒళ్లంతా కుదిపేస్తూ ప‌ర్ఫెక్ట్ లెంగ్త్ లో స్లెప్పులేస్తోంది దిశా. సాంగ్ ఆద్యంతం ఎంతో డెడికేష‌న్ ని చూపిస్తోంది. ఈ డ్యాన్స్ క్లిప్ పై టైగ‌ర్ సోద‌రి కృష్ణా ష్రాప్ స్పందించి దిశాపై ప్ర‌శంస‌లు కురిపించింది. ప్ర‌స్తుతం స‌ల్మాన్ స‌ర‌స‌న రాధే చిత్రంలో న‌టిస్తున్న దిశా కె.టీనా అనే చిత్రంలోనూ న‌టిస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి