Begin typing your search above and press return to search.

యాంకర్‌ ప్రశ్నకు షాక్‌ అయిన హీరోయిన్‌

By:  Tupaki Desk   |   7 Feb 2020 11:10 AM GMT
యాంకర్‌ ప్రశ్నకు షాక్‌ అయిన హీరోయిన్‌
X
ఆదిత్య రాయ్‌.. దిశా పటానీ జంటగా తెరకెక్కిన మలంగ్‌ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రమోషన్‌ కోసం దిశా పటానీ గత నెల రోజులుగా తెగ ఇంటర్వ్యూ లు ఇస్తూ.. టాక్‌ షోల్లో పాల్గొంటూ రియాల్టీ షోల్లో కూడా హడావుడి చేసింది. ఈ చిత్రంపై చాలా నమ్మకంతో దిశా పటానీ పబ్లిసిటీ కార్యక్రమాల్లో అన్ని తానై పాల్గొంది. ఈ సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో ర్యాఫిడ్‌ ఫైర్‌ క్వశ్చన్‌ అంటూ యాంకర్‌ అడిగిన ప్రశ్నకు దిశా నోరు వెళ్లబెట్టింది.

మలంగ్‌ చిత్రం అనగానే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చేది హీరో బుజాలపై దిశ కూర్చుని ముందుకు వంగి ముద్దు పెట్టే పోస్టర్‌. ఈ పోస్టర్‌ చాలా ఫేమస్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. ఆ పోస్టర్‌ గురించి మాట్లాడుతూ బీచ్‌ లో రొమాంటిక్‌ సీన్స్‌ లో నటించారు కదా.. మరి సెక్స్‌ ఇన్‌ ది బీచ్‌.. అంటూ యాంకర్‌ ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్న ఏంటంటూ షాక్ అయ్యి యాంకర్‌ పై దిశ ఆగ్రహం వ్యక్తం చేయగా.. హీరో ఆదిత్య రాయ్‌ మాత్రం అలాంటిది ఏమీ లేదంటూ చెప్పుకొచ్చాడు.

యాంకర్‌ ప్రశ్నకు నెటిజన్స్‌ కూడా చాలా సీరియస్‌ అవుతున్నారు. అయితే యాంకర్‌ సెక్స్‌ ఆన్‌ ది బీచ్‌ అనే డ్రిరక్‌ ఉంది.. దాన్ని మీరు తాగారా అని అడిగారంటూ వివరణ ఇవ్వడం జరిగింది. ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలు మానేసి సినిమా గురించి లేదంటే ఆ సెలబ్రెటీల గురించి ఏవైనా మంచి విషయాలు అడగవచ్చు కదా అంటూ నెటిజన్స్‌ యాంకర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.