Begin typing your search above and press return to search.

పాపం.. జీవితంలో ఏది అనుకున్నట్లు జరగడం లేదట

By:  Tupaki Desk   |   6 Jun 2022 5:30 PM GMT
పాపం.. జీవితంలో ఏది అనుకున్నట్లు జరగడం లేదట
X
తెలుగు లో లోఫర్‌ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దిశా పటానీ మొదటి సినిమా తోనే ప్లాప్‌ అవ్వడంతో ఇండస్ట్రీలో మనుగడ కష్టం అని చాలా మంది అన్నారు.. ఆమె కూడా అనుకుందట. అయితే అనుకోని అవకాశంగా ఎంఎస్‌ ధోనీలో చిన్న పాత్ర దక్కడంతో వెంటనే కమిట్‌ అయ్యిందట. ఆ సినిమా కాస్త బాలీవుడ్‌ లో ఈ అమ్మడిని స్టార్‌ హీరోయిన్ గా నిలబెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ధోనీ సినిమా తర్వాత హిందీలో వరుసగా ఈ అమ్మడికి ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా టైగర్‌ ష్రాఫ్‌ తో ఈ అమ్మడి సన్నిహిత్యం కెరీర్‌ ఎదుగుదలలో మరింతగా హెల్ప్‌ అయ్యింది. ఇండస్ట్రీ లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయంటే స్టార్‌ గా ఎదిగినట్లే. ఇప్పుడు బాలీవుడ్‌ లో దిశా పటానీ స్టార్‌ హీరోయిన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఆ విషయాన్ని ఏ ఒక్కరు కూడా కాదనలేరు.

అయితే ఆమె స్టార్‌ డమ్‌ విషయంలో ఆమె కు పూర్తి స్థాయి సంతృప్తి ఉన్నట్లుగా మాత్రం కనిపించడం లేదు. హీరోయిన్ గా నటించాలని అనుకోలేదట. పైలెట్‌ అవ్వాలని కలలు కన్న దిశా పటానీ డబ్బుల అవసరం కోసం మోడలింగ్‌ చేసిందట. మోడలింగ్‌ లో భాగంగా ఎన్నో బ్రాండ్స్ కు సంబంధించిన కమర్షియల్స్ లో నటించిందట. ఆ సమయంలోనే లోఫర్ సినిమా ఆఫర్‌ దక్కిందని.. వచ్చిన అవకాశంను ఎందుకు కాదనుకోవాలనే ఉద్దేశ్యంతో కమిట్‌ అయ్యిందట.

ఆ సినిమా నిరాశ పర్చడం తో సినిమా లు మనకు పడవులే అనుకుని మళ్ళీ మోడలింగ్ చేసుకుంటూ తన కల నెరవేర్చుకోవాలని భావిస్తున్న సమయంలో ధోనీ ఆఫర్‌ వచ్చి కాదనలేకుండా చేసిందట. ధోని సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సినిమాల్లో ఆఫర్లు వరుసగా రావడం మొదలు అయ్యింది. కొన్ని సినిమాల్లో నటించి మళ్లీ పైలెట్‌ అయ్యేందుకు వెళ్లాలని అనుకున్నారు.

కాని నా జీవితంలో ఏ ఒక్క విషయం కూడా నేను అనుకున్నట్లుగా ముందుకు సాగడం లేదు. నేను ఒకటి అనుకుంటే మరేదో అవుతుంది. నేను ఏదో అవ్వాలి అనుకుంటే ఇప్పుడు హీరోయిన్ అయ్యాను. జీవితం అంటేనే ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది. ప్రతి సందర్బంలో కూడా నన్ను నేను సర్ధి చెప్పుకుంటూ కెరీర్‌ లో జీవితంలో ముందుకు వెళ్తున్నానంటూ యూత్‌ కు మంచి సందేశాన్ని ఇచ్చింది.

హీరోయిన్‌ గా వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని కష్టపడ్డ దిశా పటానీ కి ఆశ్చర్యంగా ధోనీ సినిమా తో బ్రేక్ థ్రూ లభించింది. ఆ సినిమా తర్వాత కెరీర్‌ లో వెనుదిరిగి చూసుకోలేదు. అయినా కూడా తన కల ఇంకా మర్చి పోకుండా.. తన కెరీర్‌ సాగిన విధానంను ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.