Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ చుట్టూ స్పెక్యులేషన్స్‌ ఎందుకులే

By:  Tupaki Desk   |   20 July 2015 9:15 PM IST
ప్రభాస్‌ చుట్టూ స్పెక్యులేషన్స్‌ ఎందుకులే
X
బాహుబలి ఇంత కలెక్ట్‌ చేసింది. అంత కలెక్ట్‌ చేసింది. అలాంటప్పుడు ప్రభాస్‌ రెమ్యునరేషన్‌ ఎంత తీసుకున్నట్టు? 300కోట్లు వసూలు చేసింది కదా! కనీసం రూ.50కోట్లు అయినా తీసుకోడా? ఇలాంటి సందేహాలన్నో అభిమానుల్లో ఉన్నాయి. ఓ అభిమానిగా రామ్‌ గోపాల్‌ వర్మ కూడా ఇలాగే సందేహపడ్డాడు. ప్రభాస్‌ రాజు ఏకంగా రూ.65కోట్లు అందుకున్నాడని ప్రచారం చేశాడు వర్మ. ఇంకొందరైతే అదేం కాదు ఈ సినిమా మలయాళం, కన్నడ హక్కులు ప్రభాస్‌ కే కట్టబెట్టారు. తమిళ హక్కులు ప్రభాస్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ కి ఇచ్చారు. కాబట్టి ఆ మేరకు పొరుగు నుంచి వచ్చే ఆదాయం అంతా ప్రభాస్‌ దే అంటూ ప్రచారం చేశారు. అయితే ఇవన్నీ నిజాలేనా? అని ప్రభాస్‌ నే అడిగితే ఇలా చెప్పాడు.

బాబూ.. నేను అంత డిమాండ్‌ చేయలేదు. నా నిర్మాతలు ఇచ్చిందే తీసుకుంటున్నా. పెద్ద హిట్టయ్యింది కాబట్టి నా పారితోషికం పెరుగుతుందనే అనుకుంటున్నా అని అన్నాడు. ఆ లెక్కన కలెక్షన్ల స్థాయిని బట్టి పారితోషికం కాస్త పెంచుతారు తప్ప వాస్తవానికి హక్కులు కట్టబెట్టడాలు, లాభాల్లో షేర్‌ ఇవ్వడాలు లేవని అర్థం చేసుకోవాల్సొచ్చింది. అవన్నీ కేవలం వట్టి మాటలేనని అనుకోవాల్సొస్తోంది. మరి మొదటి భాగం ఇంత వసూలు చేసింది కాబట్టి .. ఓ రూ.15కోట్లు తీసుకున్నాడనుకున్నా.. రెండో భాగానికి ఈసారి మరో 300రోజులు కాల్షీట్లు ఇచ్చేస్తున్నాడు కాబట్టి.. పార్ట్‌ 1 కంటే పార్ట్‌ 2కి మార్కెట్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. అందుకు తగ్గట్టే ఓ 30కోట్లు అయినా డిమాండ్‌ చేయడంటారా?