Begin typing your search above and press return to search.

ఆ పదాలు పడితే మజా రాదా? టూ మచ్

By:  Tupaki Desk   |   6 April 2018 9:48 AM IST
ఆ పదాలు పడితే మజా రాదా? టూ మచ్
X
ప్రాసలతో కూడిన పంచ్ డైలాగులు రాయడంలో త్రివిక్రమ్ ను మించిన రైటర్ లేడన్నది తెలుగు సినీ ప్రేక్షకుల ప్రగాఢ విశ్వాసం. అఫ్ కోర్స్.. అజ్ఞాతవాసి దెబ్బతో ఈ నమ్మకానికి కొంచెం బీటలు వారినా.. మళ్లీ మాటల మాంత్రికుడు ఎన్టీఆర్ సినిమాతో తప్పనిసరిగా తన పెన్నుతో మాయ చేస్తాడని ఆశిస్తున్నారు. దానికి ట్రయిలరా ఏంటి అన్న మాదిరిగా.. ఐపీఎల్ యాడ్ ముందే వచ్చేసింది.

'అసలు మజా తెలుగు రా' అనే ఫినిషింగ్ టచ్ తో రూపొందిన ఈ యాడ్ లో 'కారం లేని కోడి.. ఉల్లిపాయ లేని పకోడి.. పెట్రోల్ లేని గాడి.. మీసాలు లేని రౌడీ..' ఇలా సుదీర్ఘంగా డైలాగ్ చెబుతాడు ఎన్టీఆర్. ఇందులో ప్రాసలు బాగానే ఉన్నా.. పంచ్ పేలలేదని పలువురి అభిప్రాయం. దాన్ని మరీ ఖండించేయాల్సిన పని లేదు కానీ.. అసలు మజా తెలుగు అంటూ.. 'పెట్రోల్-గాడీ-రౌడీ' అంటూ పక్క భాషల పదాలను వాడడంపై కొందరు అబ్జెక్షన్స్.. అదేనండీ అభ్యంతరాలు చెబుతున్నారు. త్రివిక్రమ్ లాంటి రైటర్.. ఒక్క డైలాగ్ కోసం ఇతర భాషలను వాడుకోవడం ఏంటి అన్నది వారి విమర్శ.

అయితే.. త్రివిక్రమ్ ఎప్పుడూ ఇతర భాషల పదాలను మిక్స్ చేసి పంచ్ లు పేల్చుతూనే ఉంటాడు. ఉదాహరణకు.. జులాయి సినిమాలో 'మనకు తెలియనిది ట్రై చేయకూడదు.. తెలిసినది ఫ్రీగా చేయకూడదు'.. 'అన్నీ ట్రై చేశారు కానీ.. పెన్ను ట్రై చెయ్యలేదు'.. లాంటి పంచ్ డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్ మిక్స్ అయ్యే ఉంటాయి. త్రివిక్రమ్ పెన్ను ఏ భాషలోనైనా పంచ్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఈ మాత్రం లాజిక్ మర్చిపోతే ఎలా మాస్టారూ?