Begin typing your search above and press return to search.

ఇక్కడ ఫుల్లు.. అక్కడ ఓపెన్

By:  Tupaki Desk   |   28 Dec 2017 5:19 PM GMT
ఇక్కడ ఫుల్లు.. అక్కడ ఓపెన్
X
తెలుగుతో పాటు తమిళంలో కూడా బోలెడంత క్రేజ్ ఉన్న ఓ హీరోయిన్ ఉంది. నేటివ్ గా ఈమె అక్కడి భామే అయినా.. గుర్తింపు వచ్చింది మాత్రం ఇక్కడి సినిమాలతోనే. స్టార్ గా ఎదిగింది కూడా టాలీవుడ్ సినిమాలతోనే. అంతగా తెలుగు ప్రేక్షకులను మెప్పించేసిన ఈ బ్యూటీ.. రీసెంట్ గానే హైద్రాబాద్ లో పర్మనెంట్ గా కూడా సెటిల్ అయింది.

ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న సినిమాల కౌంట్ తక్కువే. గ్లామర్ హీరోయిన్ గా ఈమెకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడీమె గ్లామర్ షో చేస్తుందా లేదా అని దర్శక నిర్మాతల డౌట్స్ కారణంగానే ఆఫర్స్ రావడంలేదు. తను నటించిన ఓ సినిమా కోసం ప్రమోషన్ లో కంప్లీట్ గా కవర్ చేసుకుని కనిపించింది ఈ బ్యూటీ. అంతే కాదు.. రీసెంట్ గా తన ఫ్యామిలీకి చెందిన ఓ హీరో నటించిన సినిమా విషయంలో కూడా ఇలాగే చేసింది. అంతటి అందాల భామ.. ఆ స్థాయిలో పూర్తిగా కప్పేసుకోవడం కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

అలాగని అన్ని చోట్లా ఇలాగే కనిపిస్తోందా అంటే అది కూడా లేదు. టాలీవుడ్ సినిమా ఫంక్షన్స్ వరకూ ఇలా కంప్లీట్ కవర్ చేసుకుని కనిపిస్తున్న ఆ సుందరాంగి.. కోలీవుడ్ విషయానికి వచ్చేసరికి మళ్లీ గ్లామర్ బాట పట్టేస్తోంది. అలాగని మరీ గతంలో మాదిరిగా ఎక్స్ పోజింగ్ చేసేయడం లేదు కానీ.. అంతో ఇంతో క్లీవేజ్ షో చేస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. మరి టాలీవుడ్ ఫంక్షన్స్ వరకే ఇలా చేస్తుందా.. లేక సినిమాలకు కూడా ఇలాంటి కండిషన్స్ నే పెడుతుందా అనే అంశంపై డిస్కషన్స్ తెగ జరిగిపోతున్నాయి.