Begin typing your search above and press return to search.

విప్పి చూపించలేదు.. అదొక ట్రిక్‌ అంతే

By:  Tupaki Desk   |   22 July 2015 9:50 PM IST
విప్పి చూపించలేదు.. అదొక ట్రిక్‌ అంతే
X
ఎస్‌.ఎస్‌.రాజమౌళి రొమాన్స్‌ లో ఎంతో ఎత్తుకి ఎదిగిపోయాడు. ఇదీ ప్రభాస్‌ ఇచ్చిన కాంప్లిమెంట్‌. బాహుబలి రిలీజ్‌ కి ముందే ఇంటర్వ్యూల్లో ఈ పాయింట్‌ ని హైలైట్‌ చేశాడు. అసలు ప్రభాస్‌ ఇలా ఎందుకు అన్నాడా అని అంతా ఆసక్తిగా సినిమాని తెరిపారా చూశారు. అలా చూసినవాళ్లకు 'అవును నిజమే కదా' అనిపించింది. ఈ సినిమాలో అవంతికతో శివుడి రొమాన్స్‌ చూశాక అందరూ ఒప్పే అనేశారు.

అసలు జక్కన్నలో ఇంతటి రసికరాజా ఉన్నాడని ఇంతకాలం అనుకోలేదే అంటూ కూనిరాగాలు తీశారు. రొమాన్స్‌ లో భాగంగానే 'పచ్చ బొట్టేసి' పాటని తెరకెక్కించాడు రాజమౌళి. పాటలో తమన్నా పాలనురుగు దేహాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. బులుగు రంగు సీతాకోక చిలుకల్ని దేహశిరులపై కప్పేశాడు. గ్రాఫిక్స్‌ తో మ్యాజిక్‌ చేశాడు. గురువు కె.రాఘవేంద్రరావు రేంజులో ఆ పాటని చిత్రీకరించాడు. అంతేకాదు పాట పరాకాష్టకు వెళ్లినప్పుడు తమన్నా శరీరంపై వలువల్ని వలిచేసి ప్రభాస్‌ ముందు ఆవిష్కరిస్తుంది. అతడు అంతే ఆత్రంగా ఆ అందాల్ని చూసేస్తూ ఆస్వాధిస్తాడు.

అయితే ఈ బిట్‌ లో తమ్మూ ఒంటిపై నూలుపోగైనా లేదే.. అనిపించేలా విజువలైజ్‌ చేశాడు. నునుపైన వీపు భాగాన్ని చూపించాడు. దీనిపై ఇప్పుడు కుర్రాళ్ల వాట్సాపుల్లో ఒకటే పుల్లింగ్‌. మిల్కీ బ్యాక్‌ లెస్‌ స్ట్రిప్పింగ్‌ ఫోటోని చూపిస్తూ.. నిజంగానే విప్పేసిందంటారా? అంటూ డిష్కసన్‌ పెట్టారు. అక్కడేమీ నిజంగానే విప్పేయలేదు. కెమెరా మాయాజాలమేనని చెబితే కంగు తింటున్నారంతా.