Begin typing your search above and press return to search.

150 డైలాగ్.. ఫీలవ్వాల్సిన పనిలేదు

By:  Tupaki Desk   |   24 Aug 2016 4:21 AM GMT
150 డైలాగ్.. ఫీలవ్వాల్సిన పనిలేదు
X
''పొగరు నా ఒంట్లో ఉంటుంది.. హీరోయిజమ్ నా ఇంట్లో ఉంటుంది'' అంటూ మెగాస్టార్ చిరంజీవి ''ఖైదీ నెం 150''లో ఒక డైలాగ్ పేల్చనున్నారని దర్శకుడు వివి వినాయక్ నిన్న ఒక ప్రోగ్రామ్ లో తెలియజేశారు. ఆయన చెప్పింది మొదలు.. ఈ డైలాగ్ వినేసి సోషల్ మీడియాలో నానా డిస్కషన్లు వినిపిస్తున్నాయి. సినిమా ఒక పవర్ ఫుల్ యాక్షన్ మూవీ అని కొందరు.. అబ్బే మాంచి మెసేజ్ ఓరియెంటడ్ సినిమాను పాడు చేస్తున్నారని కొందరు.. ఇలా ఒక డైలాగ్ వినేసి మాటల యుద్దం సాగిస్తున్నారు జనాలు. ఇంతకీ అసలు ఈ డైలాగ్ వలన నిజంగా మనం అర్ధం చేసుకోవాల్సింది ఏంటి?

నిజానికి ఏమీ లేదు. ఎందుకంటే ఒక్కటంటే ఒక్క డైలాగ్ వినేసి సినిమా గురించి చెప్పలేం. ఉదాహరణకు మనం ఒరిజినల్ ''కత్తి'' సినిమాను తీసుకుంటే.. కేవలం విజయ్ అండ్ సమంత మధ్యన జరిగే ఫస్ట్ హాఫ్‌ సీన్లను చూస్తే.. అసలు సినిమా ఏమీ అర్దంకాదు. ఇదేదో డబుల్ మీనింగులతో కూడిన ఒక రొటీన్ మసాలా ఎంటర్టయినర్ అన్నచందాన ఉంటుంది. అలాగే ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్ తీసుకుంటే.. అసలు ఈ సినిమాకూ ఆ డాక్యుమెంటరీకి సంబంధం ఏంటి అన్నట్లు ఉంటుంది. ఒక ఊరిలోని రైతులకు వచ్చిన ఒక సమస్యను అక్కడ ప్రస్తావిస్తారులే. అలాగే క్లయమ్యాక్స్ అనేది పీక్స్. అక్కడ పేలే సోషల్ రెస్పాన్సిబిలిటీ డైలాగులు ఓ రేంజులో ఉంటాయి.

ఇప్పుడు మెగా150 దగ్గరకు వస్తే.. కేవలం ఈ ఒక్క డైలాగ్ సినిమా ఫేట్ ను డిసైడ్ చేయలేదు. ఎందుకంటే మాస్ సినిమాలో ప్రతీ సీన్లోని డైలాగులూ చాలా ముఖ్యమే. ఏదో ఈ ఒక్క డైలాగ్ తో సినిమా రచ్చలేపేస్తుంది అనలేం.. అలాగే ఈ డైలాగ్ వలన అనవసర హీరోయిజం ఎక్కువై మెసేజ్ డైల్యూట్ అవుతుందని చెప్పలేం. నిజానికి 'కత్తి' సినిమాలో మెసేజ్ వంటివి ఏమీ ఉండవు.. కేవలం ఒక ప్రాబ్లమ్ కు కత్తి ఎలియాస్ కదిరేశన్ ఏం సొల్యూషన్ ఇచ్చాడనేదే సినిమా.