Begin typing your search above and press return to search.
2018లో తీవ్రంగా నిరాశ పర్చిన సినిమాలు ఇవే
By: Tupaki Desk | 21 Dec 2018 7:00 AM ISTకాలగమనంలో మరో సంవత్సరం కలిసి పోబోతుంది. 2018 క్యాలెండర్ మరో 10 రోజుల్లో పూర్తి కాబోతుంది. టాలీవుడ్ ఈ సంవత్సరం కూడా ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పలు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పర్చాయి. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా చిన్న చిత్రాల హవా కొనసాగింది. ముఖ్యంగా గీతగోవిందం చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకుంది. సక్సెస్ ల కంటే ఫ్లాప్ లే ఈసారి ఎక్కువగా ఇండస్ట్రీని పలకరించాయి.
2018వ సంవత్సరం పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో మొదలైంది. సంక్రాంతికి విడుదలైన అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అజ్ఞాతవాసితో పాటు బాలయ్య జైసింహా కూడా సంక్రాంతికే విడుదలైంది. ఇక రిపబ్లిక్ డే కు వచ్చిన భాగమతి పర్వాలేదన్న టాక్ తెచ్చికుంది. ఫిబ్రవరిలో విడుదలైన టచ్ చేసి చూడు చిత్రం ఈ సంవత్సరంలో మొదటి కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకుంటుందని చాలా నమ్మకంగా ప్రచారం చేశారు. కాని అది కూడా నిరాశ పర్చింది. ఆ తర్వాత ఎన్నో అంచనాల నడుమ రూపొందిన వినాయక్ - సాయి ధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత పరీక్షల సీజన్ రావడంతో సమ్మర్ వరకు చిన్న చితకా సినిమాలే వచ్చాయి. అవి కూడా పెద్దగా ప్రభావంను చూపించలేక పోయాయి.
ఇక వేసవిలో విడుదలైన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ తీవ్రంగా నిరాశ పర్చింది. ఓపెనింగ్స్ ను బాగానే రాబట్టినా ప్రేక్షకులు మాత్రం ఆ సినిమాపై తీవ్రంగా నిరాశ వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఆ దెబ్బతో ఇంకా తన తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన నేల టికెట్ చిత్రం కూడా రవితేజకు నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాదిలో భారీ అంచనాల నడుమ వచ్చిన ‘ఆఫీసర్’, ‘సిల్లీ ఫెలోస్’, ‘శైలజ రెడ్డి అల్లుడు’, ‘తేజ్ ఐ లవ్ యూ’, ‘ఎమ్మెల్యే’, ‘నా నువ్వే’, నర్తనశాల’, ‘శ్రీనివాస కళ్యాణం’, ‘నోటా’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘కవచం’ చిత్రాలు కూడా నిరాశ పర్చాయి. ఈ ఏడాది సక్సెస్ రేటు కంటే ఫ్లాప్ రేటు ఎక్కువ. వచ్చే ఏడాదైనా మరిన్ని మంచి సినిమాలు వస్తాయేమో చూడాలి.