Begin typing your search above and press return to search.

మ‌హేశ్ ఫ్యాన్స్ కు మ‌ళ్లీ నిరాశే ఎదురుకానుందా...?

By:  Tupaki Desk   |   22 July 2020 11:45 AM IST
మ‌హేశ్ ఫ్యాన్స్ కు మ‌ళ్లీ నిరాశే ఎదురుకానుందా...?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తదుపరి సినిమా 'సర్కారు వారి పాట'ను అనౌన్స్ చేసారు మహేష్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న 'సర్కారు వారి పాట' పై అటు మహేష్ ఫ్యాన్స్ లోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే అనౌన్స్మెంట్ పోస్టర్ లో చెవికి రింగు.. రఫ్ గా కనిపించేలా గడ్డం.. మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో మాసీ లుక్ లో అదరగొట్టాడు మహేష్. ఈ క్రమంలో ఆగష్టు 9న మహేష్ బర్త్ డే నాడు ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ ఏడాది నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. ప్రతి ఏడాది మహేష్ పుట్టినరోజు నాడు తన సినిమాలకి సంబంధించిన ఏదొక అప్డేట్ వస్తున్నప్పటికీ ఈసారి మాత్రం ఎలాంటి అప్డేట్ రాకపోవచ్చు. ఎందుకంటే క‌రోనా మహమ్మారి కార‌ణంగా 'సర్కారు వారి పాట' ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వ‌లేదు. దీంతో ఈ సినిమాకి సంభందించిన గ్లిమ్స్ ఇవ్వడానికి కూడా ఫుటేజీ లేదు. కాబట్టి మ‌హేశ్ పుట్టిన‌రోజున అప్ డేట్ రాక‌పోతుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి నిరాశే అని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రిలీజైన వెంటనే మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడు అనుకుంటే.. కృష్ణ బర్త్ డే దాకా ఈ విషయాన్ని వెల్లడించలేదు. దీంతో సుమారు ఐదు నెలలు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసి కాస్త నిరాశ చెందారు. ఇప్పుడు మరొకసారి మహేష్ ఫ్యాన్స్ బర్త్ డే నాడు సర్ప్రైజ్ కోసం చూస్తూ నిరాశపడక తప్పదని సినీ వర్గాలు అంటున్నాయి.