Begin typing your search above and press return to search.
అప్పటి వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూపులు తప్పవా?
By: Tupaki Desk | 21 May 2020 11:45 AM ISTఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా నిన్న కొమురం భీమ్ వీడియోను విడుదల చేయాలని ఆర్‌ఆర్‌ఆర్ టీం భావించింది. కాని ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్స్ తో పాటు కనీసం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. ఆ కారణంగానే ఎన్టీఆర్ బర్త్ డే వీడియోను విడుదల చేయలేక పోయాం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత షూటింగ్స్.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు అనుమతులు వచ్చిన వెంటనే ఫ్యాన్స్ ఆనందించేలా ఖచ్చితంగా ఒక మంచి సర్ ప్రైజ్ ఇస్తామంటూ హామీ ఇచ్చారు.
చిత్ర యూనిట్ సభ్యులు త్వరలో అంటూ ప్రకటన అయితే చేశారు కాని ఆ తర్వాతలో మాట నిజం కాకపోవచ్చు అంటున్నారు. ఇప్పట్లో ఎలాంటి అకేషన్ లేదు. కనుక ఎన్టీఆర్ కొమురం భీమ్ వీడియో విడుదల సాధ్యం అయ్యే విషయం కాదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఆగస్టు 15 వరకు కొమురం భీమ్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ ను తిరిగి ప్రారంభించేందుకు జక్కన్న అండ్ టీం ఏర్పాట్లు చేస్తున్నారు.
జక్కన్న ఒక్కసారి షూటింగ్ లో పడితే మళ్లీ ఎన్టీఆర్ వీడియోపై అంత శ్రద్ద పెడతాడో లేదో అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. అకేషన్ లేకుండా విడుదల చేస్తే పెద్దగా బజ్ ఉండదు. అందుకే రాబోయే ముఖ్యమైన పెద్ద అకేషన్ ఆగస్టు 15 కనుక అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ నందమూరి ఫ్యాన్స్ ఇప్పటికే ఫిక్స్ అయ్యి ఉన్నారు.
రామ్ చరణ్ తాజాగా చేసిన ట్వీట్ ను బట్టి చూస్తే భీమ్ ఫర్ రామరాజు వీడియో మాదిరిగానే రామరాజు ఫర్ కొమురం భీమ్ ఉంటుందని చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ వీడియో ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. అది ఎప్పుడు వస్తుందా అంటూ చాలా ఆసక్తిగా నెటిజన్స్ ఎదురు చూస్తున్నారు.