Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలలో నీళ్లు చల్లిన ఆర్ఆర్ఆర్ టీమ్

By:  Tupaki Desk   |   18 May 2020 2:20 PM IST
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలలో నీళ్లు చల్లిన ఆర్ఆర్ఆర్ టీమ్
X
తెలుగు హీరోలు ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ డ్రామాగా, బ్రిటిష్‌ కాలంలో జరిగిన కథతో దీన్ని రూపొందిస్తున్నారు రాజమౌళి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర రెండు వైవిధ్యమైన షేడ్స్‌ను కలిగి ఉంటుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఆల్రెడీ ఓ లుక్‌లో ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేయగా, మూడో షెడ్యూల్‌ కోసం ఇంకాస్త బాడీ పెంచే పనిలో ఉన్నాడట తారక్‌. డైరెక్టర్ రాజమౌళి ఎన్టీఆర్‌ను సరికొత్తగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రలో ప్రతినాయకుడి ఛాయలు కనిపిస్తాయని, తను అడవి దొంగగా కనిపించబోతున్నాడని ఇటీవలే ప్రచారాలు కూడా జరిగాయి.

ఈ నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ సాధారణంగా, మరికొన్ని సన్నివేశాల్లో కండలు తిరిగిన దేహంతో ఉంటాడని సమాచారం. అందు కోసం తారక్‌ తన బాడీని మేకోవర్‌ చేసే పనిలో ఉన్నారట. మరి ఇప్పుడు ఎలా కనిపిస్తారనేది కాస్త సస్పెన్స్‌. ఇది వరకే రాంచరణ్ బర్త్ డే రోజు 'భీమ్ ఫర్ రామరాజు' స్పెషల్ వీడియో విడుదల చేసి ట్రీట్ ఇచ్చారు రాజమౌళి టీమ్. ఆ వీడియోలో ఎన్టీఆర్ వాయిస్ ఓ రేంజ్ వైబ్రేషన్స్ సృష్టించింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు మాత్రం రాజమౌళి మే 20న విడుదల చేయబోయే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఇంతలో రాజమౌళి టీమ్ ఓ చేదు వార్తను మిగిల్చింది. అదేంటంటే.. మే 20న అంటే ఎన్టీఆర్ బర్త్ డే రోజు మాత్రం.. ఎన్టీఆర్ కి సంబంధించి ఎలాంటి ఫస్ట్ లుక్ కానీ, స్పెషల్ వీడియో లాంటివి ఏవి రిలీజ్ చేయట్లేదని ప్రకటించారు. మేం చాలా ప్రయత్నించాం స్పెషల్ ట్రీట్ ఇద్దామని కానీ లాక్ డౌన్ డేట్ పొడిగించడం తో ఆ వీడియో వర్క్ పూర్తి కాలేదని ఆర్ఆర్ఆర్ టీమ్ తెలిపారు. ఈ వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆశలతో నీళ్లు చల్లినంత పనైంది.