Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు జల్లిన మోడీ ప్రకటన
By: Tupaki Desk | 13 May 2020 12:00 PM ISTఎన్టీఆర్ పుట్టిన రోజు(మే 20)న భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు నందమూరి ఫ్యాన్స్ సన్నాహాలు చేశారు. మే 18తో లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో 20వ తారీకున భారీగా పుట్టిన రోజు వేడుకను జరుపుకోవాలని ఫ్యాన్స్ భావించారు. కాని లాన్ డౌన్ ను మరోసారి పొడగించబోతున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ప్రకటించారు. లాక్ డౌన్ 4.0 ఎప్పటి వరకు అనేది అతి త్వరలోనే క్లారిటీ రాబోతుంది.
ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్ నీరుగారి పోయారు. ఎన్టీఆర్ బర్త్ డేకు చాలా అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ మోడీ ప్రకటనతో ఆలోచనల్లో పడ్డారు. బహిరంగంగా భారీ వేడుకలపై ఆంక్షలు ఉండబోతున్నాయి. దాంతో ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలు కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవ్వబోతున్నాయి. హ్యాపీ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రెండ్ చేయనున్నారు. ఇక ఈ లాక్ డౌన్ వల్ల ఆర్‌ఆర్‌ఆర్ నుండి రావాల్సిన సర్ ప్రైజింగ్ వీడియో కూడా క్యాన్సిల్ అవ్వనుందా అనే ఆందోళన ఫ్యాన్స్ లో వ్యక్తం అవుతోంది.
గత ఏడాది తండ్రి మరణం నుండి కోలుకోని ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలకు నో చెప్పాడు. ఈ ఏడాదిలో అయినా భారీగా బర్త్ డే వేడుక నిర్వహించాలని ఫ్యాన్స్ ఆశిస్తే ఇప్పుడేమో ఇలా అయ్యింది. ఈ విపత్కర పరిస్థితుల్లో కనీసం ఆర్‌ఆర్‌ఆర్ వీడియో వచ్చినా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతలో కొంత అయినా సంతోషిస్తారు. మరి జక్కన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఆ సంతోషంను అయినా మిగిల్చుతాడో లేదో చూడాలి.