Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి లాక్ డౌన్ పంచ్ అలా
By: Tupaki Desk | 8 May 2020 11:15 AM ISTకరోనా కల్లోలం ఇక్కడి తో ఆగేట్టు లేదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు లాక్ డౌన్ లను పొడిగించాల్సి వస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారీ అంతకంతకు పెరుగుతుండడంతో బెంబేలెత్తిపోయే సన్నివేశం కనిపిస్తోంది. వైరస్ ఇంకా గాల్లోనే షికారు చేస్తూ మనుషుల్ని చుట్టబెట్టేస్తోందన్న ఆందోళన అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో షూటింగుల్లేక రిలీజ్ లు లేక టాలీవుడ్ పై బిగ్ పంచ్ పడిపోయింది.
ఇది కేవలం పరిశ్రమపై మాత్రమే పోటు అనుకోవడానికి వీల్లేదు. స్టార్లు అందరిపైనా పడుతున్న పంచ్ అనే గ్రహించాలి. ఇక తమ హీరోల బర్త్ డే పేరుతో దర్శకనిర్మాతలు బోలెడంత ప్రచారాన్ని ప్లాన్ చేస్తుంటారు. వాటన్నిటికీ చెక్ పడిపోయింది. ఇలాంటి టైమ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కి సమయమాసన్నమైంది. మే 20 ఆయన బర్త్ డే. సహజంగానే మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న తారక్ పై ఇది ఒత్తిడి పెంచేదేనని అంచనా వేస్తున్నారు. తారక్ బర్త్ డే అంటే ఊరూ వాడా బోలెడంత హంగామా ఉండేది సాధరణ సమయంలో. సోషల్ మీడియాల్లో అయితే అభిమాన సంఘాలు చేసే హంగామా మామూలుగా ఉండదు. అయితే ఈసారికి బహిరంగ ప్రదేశాల్లో హంగామాకి ఆస్కారం లేకుండా పోయింది. కరోనా ఇంపార్ట్ అలా పని చేయనుంది.
ఇప్పటికే తారక్ బర్త్ డే నాటికి కనీసం మోషన్ పోస్టర్ అయినా రెడీ చేయలేమని ఆర్.ఆర్.ఆర్ టీమ్ చేతులెత్తేసింది. లాక్ డౌన్ వల్ల ఆ పని చేయలేకపోతున్నామని సారీ చెప్పేశారు జక్కన్న. చరణ్ బర్త్ డే సమయంలో లాక్ డౌన్ లేదు కాబట్టి మోషన్ టీజర్ రిలీజ్ చేయగలిగారు. కానీ ఈసారి తారక్ కి ఆ సన్నివేశం లేనే లేదు. దీని వల్ల ఆర్.ఆర్.ఆర్ లో కొమురం భీమ్ పాత్ర ఎలా ఉంటుందో అభిమానులు వీక్షించే వీల్లేకుండా పోయింది. మే 29 వరకూ తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ని పొడిగించడంతో ఇక బర్త్ డేలకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? పైగా మోషన్ పోస్టర్లు యానిమేషన్ వంటి వాటిని చేయాలంటే స్టూడియోలు- ల్యాబులు తెరుచుకోవాలి కదా! అవేవీ తెరవలేదింకా. దీంతో ఏ పనినీ పూర్తి చేయలేమని భావించి ప్రచారానికి దూరమైపోతున్నారు.
కనీసం #NTR30 కి సంబంధించి అయినా త్రివిక్రమ్- హారిక హాసిని క్రియేషన్స్ బృందం ఏదైనా తీపి కబురు చెబుతుందా? టైటిల్ మోషన్ పోస్టర్ లాంటివి అయినా రిలీజ్ చేస్తారా? అంటే అది కూడా కుదరదనే తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి `అయినను పోయిరావలె హస్తినకు` అనే ఆసక్తికర టైటిల్ ప్రచారంలో ఉంది. కనీసం టైటిల్ పోస్టర్ వేసినా కొంతవరకూ తారక్ ఫ్యాన్స్ సంతృప్తి చేందేందుకు వీలుంటుంది. కానీ హారిక టీమ్ ఆ సాహసం చేయలేని పరిస్థితి. లాక్ డౌన్ వల్ల స్ట్రిక్టుగా రూల్స్ ని ఫాలో చేయాల్సి ఉండగా ఇలాంటి ప్రచారాలు చేస్తూ ప్రభుత్వాలు ఊరుకుంటాయా? పోలీసులు వదిలేస్తారా? అందుకే ఇలా సందిగ్ధంలో పడిపోయారట. ఇది ఒక్క ఎన్టీఆర్ పరిస్థితే కాదు. అందరి పరిస్థితి ఇదే.