Begin typing your search above and press return to search.

'డర్టీ పిక్చర్‌' నటి అనుమానాస్పద మృతి

By:  Tupaki Desk   |   12 Dec 2020 9:35 AM GMT
డర్టీ పిక్చర్‌ నటి అనుమానాస్పద మృతి
X
విద్యాబాలన్‌ నటించిన 'డర్టీ పిక్చర్‌' సినిమాలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్‌ నటి మోడల్‌ ఆర్య బెనర్జీ మృతి చెందారు. కోల్‌కతాలోని తన ఇంట్లో ఆమె మృతి చెందింది. నిన్న ఉదయం పని మనిషి వచ్చి తలుపులు ఎంతగా కొట్టినా ఓపెన్‌ చేయక పోవడంతో అనుమానం వచ్చింది. దాంతో వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తలుపులు పగులకొట్టి చూడగా ఆర్య బెనర్జీ మృతి చెంది ఉంది. ఆర్య బెనర్జీ ముక్కు నుండి రక్తం రావడంతో పాటు బెడ్‌ మీద పడి ఉండటంతో ఆత్మహత్య కాదేమో అనే అనుమానంను పోలీసులు మరియు ప్రత్యక్ష సాక్ష్యులు వ్యక్తం చేస్తున్నారు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కాల్‌ డేటాను పరిశీలించడంతో పాటు ఆమె సన్నిహితులను మరియు పని మనిషిని విచారిస్తున్నారు. నటిగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆర్య బెనర్జీ మృతి పట్ల బాలీవుడ్‌ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. 33 ఏళ్ల ఆర్య బెనర్జీ వ్యక్తిగత మేనేజర్‌ ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెది హత్యనా ఆత్మహత్యనా అనే విషయాన్ని పోలీసులు నిర్థారించేందుకు శవ పంచనామా నిర్వహిస్తున్నారు.