Begin typing your search above and press return to search.

కొత్త ఏటీటీలో డిసెంబర్ 18న ఎం.ఎస్.రాజు 'డర్టీ హరి'..!

By:  Tupaki Desk   |   5 Dec 2020 1:55 PM GMT
కొత్త ఏటీటీలో డిసెంబర్ 18న ఎం.ఎస్.రాజు డర్టీ హరి..!
X
కరోనా సంక్షోభ పరిస్థితుల్లో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాయి. అమెజాన్‌ ప్రైమ్ వీడియో - నెట్‌ ప్లిక్స్ - ఆహా - సన్‌ నెక్స్ట్‌ - డిస్నీ+ హాట్‌ స్టార్‌ - జీ5 - ఏటీఎల్‌ బాలాజీ వంటి ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లు తమ పరిధిని పెంచుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో అనేక కొత్త ఓటీటీలు - ఏటీటీలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా 'ఫ్రైడే మూవీస్' అనే మరో డిజిటల్ వేదికను క్రియేట్ చేశారు. దీంట్లో టాలీవుడ్ సీనియర్‌ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'డర్టీ హరి' ని రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 18న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ కి పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

తాజాగా విడుదల చేసిన 'డర్టీ హరి' పోస్టర్ లో హీరో హీరోయిన్లు టాప్ లెస్ గా బ్యాక్ సైడ్ లుక్ ని చూపించారు. ఈ చిత్రాన్ని నేటి యువతను దృష్టిలో పెట్టుకొని రొమాంటిక్‌ థ్రిల్లర్‌ గా రూపొందించారు. ఈ సినిమాలో శ్రవణ్‌ రెడ్డి - రుహానీ శర్మ - సిమ్రత్‌ కౌర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. గూడూరు శివ రామకృష్ణ సమర్పణలో సతీష్ బాబు - సాయి పునీత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్ విశేషమైన ఆదరణ పొందాయి. ఈ చిత్రంలో రొమాంటికి సన్నివేశాలు.. కుర్రకారుని ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. మార్క్ కె. రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న ఎం.ఎస్.రాజు యూత్ ని టార్గెట్ చేస్తూ చేసిన 'డర్టీ హరి' సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 18 వరకు ఆగాల్సిందే.