Begin typing your search above and press return to search.

ఇద్దరికీ రెండో దెబ్బ పడింది

By:  Tupaki Desk   |   26 Jan 2019 9:37 AM GMT
ఇద్దరికీ రెండో దెబ్బ పడింది
X
పరిశ్రమలో కొత్త దర్శకులకు సెకండ్ మూవీ ఫెయిల్యూర్ అనే గండం ఎప్పటి నుంచో ఉన్నదే. కేవలం రాజమౌళి కొరటాల శివలాంటి ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ దీని బారిన పడినవాళ్ళే. డెబ్యు మూవీ ఇచ్చిన సక్సెస్ కిక్కో లేక అంతకు మించిన అవుట్ పుట్ ఇవ్వాలన్న ఒత్తిడో తెలియదు కాని ఈ విఘ్నాన్ని దాటడం మాత్రం అంత ఈజీ కాదు. మురారి సినిమాలో శాపంలాగా ఇది ఎందరినో వేటాడింది. ఇప్పుడు ఈ లిస్టు లో సంకల్ప్ రెడ్డి తో పాటు వెంకీ అట్లూరి చేరిపోయాడు.

ఘాజీతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకట్టుకున్న సంకల్ప్ ఆ మేజిక్ ని అంతరిక్షంతో రిపీట్ చేయలేకపోయాడు. కథకు కావాల్సిన డ్రామా కన్నా ప్రేక్షకులకు సైన్సు బోధించడంలో ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ఫలితం తేడా కొట్టింది. పది రోజులకే దుకాణం సర్దేసి నిర్మాతలకు నష్టం మిగిల్చింది. వరుణ్ తేజ్ ఎఫ్2తో వెంటనే కోలుకున్నాడు కాని లేకపోతే మెగా హీరో డిఫెన్స్ లో పడేవాడే

ఇక మిస్టర్ మజ్నుతో వెంకీ అట్లూరి కూడా అదే రిజల్ట్ అందుకున్నాడు. పెద్దగ కథ లేకుండా తొలిప్రేమలో పాయింట్ నే మళ్ళి తీసుకుని అదే లండన్ బ్యాక్ డ్రాప్ లో హీరో హీరొయిన్ల మార్చి తీసిన ప్రయత్నం ప్రేక్షకుల మెప్పును పూర్తి స్థాయిలో పొందలేకపోయింది. అఖిల్ నాలుగో రీ లాంచ్ కోసం ఎదురు చూడక తప్పదని గట్టి కామెంట్స్ వినపడుతున్నాయి. డెబ్యు మూవీ కన్నా పెద్ద హిట్ ఇస్తాడని కోరుకున్న అక్కినేని అభిమానులను వెంకీ అట్లూరి బాగా నిరాశ పరిచాడు, ఫస్ట్ హాఫ్ కొంత తమన్ సంగీతం కొంతమేరకు కాపాడుతున్నాయి కానీ లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. సో ఇద్దరు కుర్ర దర్శకులు చేసిన పొరపాట్లు తగిన మూల్యం చెల్లించుకునేలా చేసాయి