Begin typing your search above and press return to search.
ఓ ఇంటివాడైన నాని 'అంటే.. సుందరానికీ' డైరెక్టర్
By: Tupaki Desk | 19 Dec 2020 4:15 PM ISTటాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో శ్రీజ గౌని మెడలో మూడు ముళ్లు వేశాడు వివేక్ ఆత్రేయ. ఈ వివాహ వేడుకకు యువ హీరో శ్రీవిష్ణు దంపతులు - హీరోయిన్ నివేదా థామస్ మరియు వివేక్ ఆత్రేయ దగ్గర వర్క్ చేసే పలువురు అసిస్టెంట్ డైరెక్టర్స్ హాజరై నూతన వధూవరులకు తమ విషెస్ అందించారని తెలుస్తోంది. కాగా, శ్రీవిష్ణు - నివేతా పేతురాజ్ జంటగా నటించిన 'మెంటల్ మదిలో' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు వివేక్ ఆత్రేయ. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇదే క్రమంలో శ్రీవిష్ణు - నివేదా థామస్ లతో 'బ్రోచెవారెవరురా' అనే మరో వైవిద్యమైన సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని తో 'అంటే.. సుందరానికీ' అనే సినిమా చేస్తున్నాడు వివేక్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - యలమంచిలి రవిశంకర్ నిర్మించనున్నారు. ఇందులో మలయాళ బ్యూటీ నజ్రియా ఫాహద్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. టైటిల్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగిన వివేక్ ఆత్రేయ 'అంటే.. సుందరానికీ!' చిత్రంతో మరో హిట్ అందుకుంటారని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఇకపోతే వివేక్ ఆత్రేయ రెండో సినిమా 'బ్రోచెవారెవరురా' రీమేక్ రైట్స్ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సొంతం చేసుకున్నారని టాక్ నడుస్తోంది.