Begin typing your search above and press return to search.

సాయిపల్లవి విషయం తేల్చేసిన డైరెక్టర్!

By:  Tupaki Desk   |   29 March 2019 4:27 AM GMT
సాయిపల్లవి విషయం తేల్చేసిన డైరెక్టర్!
X
ఈమధ్య తమిళ డైరెక్టర్ ఎఎల్ విజయ్ తో హీరోయిన్ సాయిపల్లవి ప్రేమలో ఉందని..త్వరలో ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు కోలీవుడ్ కే పరిమితం కాకుండా సౌత్ అంతా గుప్పుమన్నాయి. ఎఎల్ విజయ్ దర్శకత్వంలో సాయి పల్లవి 'కణం' అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని.. ఇపుడు అదే ప్రేమ ఇప్పుడు పెళ్లిగా మారుతోందని అన్నారు.

ఈ వార్తల పట్ల సాయి పల్లవి ఫ్యాన్స్ కాస్త చిర్రుబుర్రులాడిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ఎఎల్ విజయ్ స్పందించాడు. తమ పెళ్లివార్తలన్నీ అవాస్తవమని.. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే సాయి పల్లవి మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు.

ఎఎల్ విజయ్ గతంలో హీరోయిన్ అమలా పాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ఇద్దరూ విడిపోవడం తెలిసిందే. విడాకులకు తీసుకున్న తర్వాత ఎఎల్ విజయ్ సింగిల్ గానే ఉంటున్నాడు. సినిమాల విషయానికి వస్తే ఎఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవి 2' త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభుదేవా.. తమన్నా హీరో హీరోయిన్లుగా నటించారు.