Begin typing your search above and press return to search.

సూపర్ హిట్ మూవీ సీక్వెల్‌.. ఉసూరుమనిపించారు

By:  Tupaki Desk   |   29 Oct 2022 9:30 AM GMT
సూపర్ హిట్ మూవీ సీక్వెల్‌.. ఉసూరుమనిపించారు
X
నందమూరి కళ్యాణ్ రామ్‌ చాలా సంవత్సరాల తర్వాత బింబిసార సినిమా తో సక్సెస్ ను దక్కించుకున్నాడు. కమర్షియల్‌ గా.. టాక్‌ పరంగా కలెక్షన్స్ పరంగా ఇలా అన్ని రకాలుగా బింబిసార సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జోష్ తో కళ్యాణ్ దూసుకు వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కళ్యాణ్ రామ్‌ ప్రస్తుతం డెవిల్ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే బింబిసార సీక్వెల్‌ ను చేయబోతున్నట్లుగా ఇప్పటి వరకు నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు అంతా కూడా మాట్లాడుకుంటున్నారు.

కానీ తాజాగా బింబిసార దర్శకుడు వశిష్ఠ్‌ ఆ విషయం నిజం కాదు అన్నాడు. వెంటనే బింబిసార సినిమా యొక్క సీక్వెల్‌ ను మొదలు పెట్టలేం అన్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్‌ గారికి ఉన్న కమిట్‌ మెంట్స్ అన్నీ పూర్తి అవ్వడంతో పాటు సీక్వెల్‌ కోసం మంచి కథ సెట్‌ అయినప్పుడు మాత్రమే తాము సీక్వెల్‌ ను మొదలు పెట్టబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

దర్శకుడు వశిష్ఠ్‌ చెబుతున్న దాని ప్రకారం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో సూపర్‌ హిట్‌ సినిమా యొక్క సీక్వెల్‌ గురించిన ఎలాంటి చర్చ ఉండే అవకాశం లేదు. అసలు ఇప్పట్లో సీక్వెల్‌ యొక్క చర్చలు కూడా మొదలు అయ్యే అవకాశం లేదు అంటూ ఆయన మాటలు విన్న తర్వాత మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

మొత్తానికి సూపర్ హిట్‌ సినిమా యొక్క సీక్వెల్‌ ను వెంటనే మొదలు పెడితే చూద్దాం అనుకున్న నందమూరి అభిమానులకు దర్శకుడి మాటలు ఉసూరుమనిపించే విధంగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాకున్నా బింబిసార సీక్వెల్‌ ఎప్పుడు వచ్చినా తప్పకుండా కళ్యాణ్‌ రామ్‌ కి మరో విజయాన్ని తెచ్చి పెడుతుందని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.