Begin typing your search above and press return to search.
వినాయక్ లో విక్రమార్కుడు కనిపిస్తున్నాడు
By: Tupaki Desk | 18 Sept 2022 10:00 PM ISTఏదైనా విషయంలో ఫెయిల్ అయితే దాన్ని వదిలేయకుండా అందులో విజయం సాధించే వరకు ప్రయత్నాలు చేసేవారిని పట్టువదలని విక్రమార్కుడు అంటారు. అది మంచి పద్ధతి.. ఒక ఫ్లాప్ రాగానే వదిలేసి వెళ్లకుండా ప్రయత్నిస్తేనే సూపర్ హిట్స్ వస్తాయి... సూపర్ స్టార్స్ అవుతారు అంటూ చాలా మంది హీరోలు.. చాలా మంది దర్శకులు నిరూపించారు.
ఇప్పుడు ఆ పట్టు వదలని విక్రమార్కుడిని ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ తనలో చూపించబోతున్నాడు. ఈయన దర్శకుడిగా వరుసగా నిరాశ పర్చుతున్నా కూడా సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇదే సమయంలో ఆయనకు నటనపై ఉన్న ఆసక్తితో పట్టువదలని విక్రమార్కుడు తరహాలో ప్రయత్నం చేస్తున్నాడు.
వినాయక్ కి నటనపై ఆసక్తిని గుర్తించిన దిల్ రాజు సీనయ్య అనే సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయిన తర్వాత ఔట్ పుట్ సరిగా రావడం లేదు అంటూ ఆపేశారట. నటనపై తనకు ఉన్న ఆసక్తితో వినాయక్ మరో సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఛత్రపతి రీమేక్ ను వినాయక్ రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదల అయిన తర్వాత స్వీయ దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మించి అందులో తానే నటించేందుకు వినాయక్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడట.
వినాయక్ ఇమేజ్ మరియు బాడీ లాంగ్వేజ్ తో పాటు వయసుకు తగ్గ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని సమాచారం అందుతోంది. వినాయక్ నటుడిగా ఈసారైనా పూర్తి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ని దక్కించుకునేనా అనేది చూడాలి.