Begin typing your search above and press return to search.
స్నేహితుడిపై త్రివిక్రమ్ ఫోకస్ పెట్టడం లేదా?
By: Tupaki Desk | 25 July 2020 10:45 AM ISTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు సునీల్ మంచి స్నేహితులు అనే విషయం తెల్సిందే. వీరిద్దరు కెరీర్ ఆరంభం నుండే పరిచయస్తులు. ఒక మాట చెప్పాలంటే సునీల్ వల్లే త్రివిక్రమ్ కు సినిమాల్లో ఆఫర్లు దక్కాయి అనేది కొందరు అనే మాట. దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న తర్వాత త్రివిక్రమ్ కూడా సునీల్ కు తన వంతు సాయంను చేస్తూనే వచ్చాడు. మద్యలో సునీల్ హీరోగా ప్రయత్నాలు చేయడం జరిగింది. హీరోగా కొన్నాళ్లు బాగానే రాణించిన సునీల్ వరుస ఫ్లాప్స్ తో మళ్లీ కమెడియన్ గా మారాడు.
సునీల్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా ఇప్పటి వరకు మంచి పాత్ర దక్కలేదు. కొన్ని సినిమాల్లో నటించినా కూడా ఆయన పాత్రకు ప్రాముఖ్యత లేకపోవడం గతంలో మాదిరిగా నవ్వించలేక పోవడం జరుగుతుంది. త్రివిక్రమ్ సీరియస్ గా ఫోకస్ పెడితే సునీల్ కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. సునీల్ హీరోగా చేసే సమయంలోనే త్రివిక్రమ్ ఆయనతో ఒక సినిమా చేస్తే హీరోగా మరింత స్టార్ డం దక్కేది. కాని సునీల్ తో సినిమాకు త్రివిక్రమ్ ఆసక్తి చూపించలేదు. రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ సునీల్ తో సినిమా తీశాడు కాని మిత్రుడిగా పేరున్న త్రివిక్రమ్ మాత్రం సునీల్ తో ఎందుకు సినిమా చేయలేదు అంటూ అప్పుడే చర్చ జరిగింది.
సునీల్ కెరీర్ తలకిందులు అయ్యి మళ్లీ కమెడియన్ గా చేస్తున్న ఈ సమయంలో అయినా అతడి కోసం కాస్త మంత్రి పాత్రలను ఇవ్వొచ్చు కదా అంటూ త్రివిక్రమ్ ను కొందరు ప్రశ్నిస్తున్నారు. తన అరవింద సమేత చిత్రంలో సునీల్ కు ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్ ఆయన స్థాయి మరింత తగ్గేల చేశాడు. ఆ సినిమాలో సునీల్ కు ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వక పోవడంతో సునీల్ కు ఆ సినిమా పెద్దగా ఉపయోగపడలేదు. మరోసారి ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమాలో అయినా సునీల్ కు ఒక మంచి పాత్ర దక్కుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. స్నేహితుడి కోసం ఈసారి అయినా త్రివిక్రమ్ ఫోకస్ పెట్టి పాత్రను రాస్తే తప్పకుండా ఆయన మరికొంత కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతాడని సునీల్ అభిమానులు అంటున్నారు.