Begin typing your search above and press return to search.

యంగ్ హీరో సినిమాలో ప్రముఖ దర్శకుడు..!

By:  Tupaki Desk   |   1 Aug 2022 6:32 AM GMT
యంగ్ హీరో సినిమాలో ప్రముఖ దర్శకుడు..!
X
విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలను దక్కించుకుంటున్న యంగ్‌ అండ్ ట్యాలెంటెడ్‌ తమిళ్ హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం మావీరన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. రెమో.. డాక్టర్‌.. డాన్ వంటి చిత్రాలతో తెలుగు లో కూడా పాపులారిటీని దక్కించుకున్న శివకార్తికేయన్‌ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ మావీరన్‌ ను కూడా ఇక్కడ విడుదల చేయబోతున్నారు.

మావీరన్ గురించి తమిళ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న మిస్కిన్‌ ను రంగంలోకి దించబోతున్నారట. ఆయన సినిమాలకు తమిళనాట మంచి డిమాండ్‌ ఉంది. అన్ని విధాలుగా ఆయన సినిమాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి అనేది టాక్‌.

అలాంటి దర్శకుడిని మావీరన్‌ లో నటింపజేయడం వల్ల ఖచ్చితంగా సినిమా పై భారీ గా అంచనాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమా కు మడోన్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

సినిమాలో శివ కార్తికేయన్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉండటంతో పాటు గతంలో ఎప్పుడు చూడని విధంగా హీరోను ఆయన చూపించబోతున్నట్లుగా తమిళ్‌ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

తెలుగు లో శివ కార్తికేయన్‌ ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. జాతిరత్నాలు చిత్ర దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో ప్రిన్స్ అనే సినిమా లో ఈయన నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ ఏడాది చివరి వరకు లేదా వచ్చే ఏడాది ఆరంభం కు ప్రిన్స్ గా తెలుగు మరియు తమిళ ప్రేక్షకుల ముందుకు ఒకే సారి శివ కార్తికేయన్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.