Begin typing your search above and press return to search.
అమ్మడిని తేజ సినిమా నుంచి అందుకే తప్పించారా...?
By: Tupaki Desk | 17 July 2020 12:15 PM ISTక్రియేటివ్ డైరెక్టర్ తేజ 'సీత' సినిమా ఆశించినంత విజయం అదించకపోవడంతో కొంచెం గ్యాప్ తీసుకుని ఇటీవల రెండు చిత్రాల్ని ప్రకటించారు. ఆ రెండు సినిమాలు 'రాక్షస రాజు రావణాసురుడు' 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే టైటిల్స్ తో తెరకెక్కించబోతున్నట్లు వెల్లడించారు. ఇక 'అలమేలు మంగ వెంకటరమణ' సినిమాలో హీరోగా యాక్షన్ హీరో గోపీచంద్ నటించనున్నాడని.. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. అయితే కొద్ది రోజులుగా కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకొన్నారనే వార్త వైరల్ అయింది.
నిజానికి తేజ దర్శకత్వం వహించిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకోవడంతో తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గా భారీ రెమ్యునరేషన్ అందుకుంది. ఇక తేజ దర్శకత్వంలో 'నేనే రాజు నేనే మంత్రి' 'సీత' సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ క్రమంలో 'అలిమేలు మంగ వెంకట రమణ' లో కూడా కాజల్ నే నటింపజేయాలని తేజ భావించారట. అయితే కాజల్ ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసారని.. ప్రొడ్యూసర్స్ అందుకు ఒప్పుకోకపోవడంతో కాజల్ ఈ సినిమా చేయనని చెప్పేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం 'అలమేలు మంగ వెంకట రమణ' చిత్రంలో కీర్తి సురేష్ తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ 'రంగ్ దే' మరియు 'గుడ్ లక్ సఖీ' అనే సినిమాల్లో నటిస్తున్న కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తోంది. కాగా కీర్తి సురేష్ కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తన రెమ్యునరేషన్ తగ్గించుకొంటున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో భారీగా డిమాండ్ చేసిన కాజల్ ని పక్కన పెట్టి కీర్తి ని తేజ సినిమాకు తీసుకున్నారట. అంతేకాకుండా 'మహానటి' సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ఎంపిక పట్ల చిత్ర యూనిట్ సంతృప్తిగా ఉన్నారట. మొత్తం మీద కాజల్ అగర్వాల్ అధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో కీర్తి సురేష్ కే చిత్ర యూనిట్ ఓటు వేసిందనే వార్త అయితే ఫిలిం సర్కిల్స్ లో షికారు చేస్తోంది.