Begin typing your search above and press return to search.
తేజ కూడా ఆన్ లైన్ బాట పట్టాడు
By: Tupaki Desk | 27 April 2020 1:40 PM ISTఎప్పుడు షూటింగ్స్.. స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉండే స్టార్స్ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. షూటింగ్స్ లేకపోవడంతో టైం పాస్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతూ సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నారు. అయితే కొద్ది మంది మాత్రం ఈ సమయంను సరైన రీతిలో వినియోగించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్పానిష్ లాంగ్వేజ్ ను నేర్చుకుంటున్నట్లుగా చెప్పగా మరికొందరు మరికొన్ని రకాల కోర్సులను నేర్చుకుంటున్నామంటూ చెబుతున్నారు. తాజాగా దర్శకుడు తేజ కూడా ఆన్ లైన్ లో కోర్సు నేర్చుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు.
ఒక ఇంగ్లీష్ డైలీతో దర్శకుడు తేజ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆన్ లైన్ లో డబ్ల్యూహెచ్‌ఓ వారు నేర్పించే వైరస్ లకు సంబంధించిన క్లాస్ లను చెబుతున్నారు. ఆ క్లాస్ లను తేజ వింటున్నాడట. ఈ వయసులో దర్శకుడు తేజ చూపిస్తున్న ఆసక్తిని నిజంగా అభినందించాల్సిందే. ఆయన ప్రస్తుతం కరోనా వైరస్ పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన విషయాలపై అధ్యాయనం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అసలు వైరస్ ఎక్కడ పుట్టింది.. ఆ వైరస్ వ్యాప్తికి కారణం ఏంటీ ఎన్ని రకాల వైరస్ లు ఉన్నాయనే విషయమై ఆయన ఆన్ లైన్ ద్వారా నేర్చుకుంటున్నాడట. ప్రస్తుతం రెండు సినిమాలను లైన్ లో పెట్టిన ఈ దర్శకుడు లాక్ డౌన్ ముగిసిన వెంటనే షూటింగ్ ను మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. గోపీచంద్ తో ఒక సినిమాను మరియు రానాతో మరో సినిమాను తేజ ప్లాన్ చేస్తున్నాడు. ఈరెండు సినిమాలకు తేజ ఇప్పటికే టైటిల్స్ ను రిజిస్ట్రర్ చేయించడం వాటిని ప్రకటించడం కూడా జరిగింది.