Begin typing your search above and press return to search.

తేజ 'ఆణిముత్యం'.. అప్పుడే అన్ని ఆఫర్లా..?

By:  Tupaki Desk   |   9 Nov 2022 9:30 AM GMT
తేజ ఆణిముత్యం.. అప్పుడే అన్ని ఆఫర్లా..?
X
తెలుగు దర్శకుల్లో కొత్తవారికి అవకాశం ఇచ్చే వారిలో తేజా ఒకరు. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకున్నా ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ లో ఒక అటెన్షన్ వస్తుంది. తేజా సినిమాలే కాదు ఆయన డైరక్షన్ లో ఇంట్రడ్యూస్ అయ్యే హీరోయిన్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది. తేజా డైరక్షన్ లో వచ్చి స్టార్ హీరోయిన్స్ గా క్రేజ్ తెచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు. తేజా తీసిన చివరి రెండు సినిమాలు నేనే రాజు నేనే మంత్రి.. సీత సినిమాలకు కాజల్ ని రిపీట్ చేశాదు. ఆ సినిమాల తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్న తేజా దగ్గుబాటి వారసుడు అభిరాం ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.

తేజా డైరక్షన్ లో అభిరాం హీరోగా వస్తున్న అహింస సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీతో గీతిక అనే అమ్మాయి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. మోడల్ గా వాణిజ్య ప్రకటనలు చేస్తున్న గీతిక తన సినిమాలో పాత్రకు పర్ఫెక్ట్ సూట్ అవుతుందని ఆమెని సెలెక్ట్ చేశాడు తేజా.

తేజా పరిచయం చేస్తే ఆ హీరోయిన్ కి టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. తేజా సినిమా అనడం కన్నా యాక్టింగ్ స్కూల్ గా వాళ్లని ట్రైన్ చేస్తాడు. అంతేకాదు తను చెప్పినట్టుగా అవుట్ పుట్ ఇవ్వకపోతే చేయి కూడా చేసుకుంటాడు. అప్పట్లో హీరోయిన్స్ ని కొట్టే డైరక్టర్ అంటూ తేజా మీద చాలా హడావిడి జరిగింది.

ప్రస్తుతం అహింస సినిమాతో గీతికని పరిచయం చేస్తున్నాడు తేజా. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన నీతోనే నీతోనే సాంగ్ లో ఆమె పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు డైరక్టర్స్ కూడా గీతిక మీద ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది.

త్రివిక్రం గీతికని మహేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నట్టు టాక్. అదే నిజమైతే మాత్రం అమ్మడికి జాక్ పాట్ తగిలినట్టే లెక్క. గీతిక నాగార్జునతో కళ్యాణ్ జెవెలర్స్ యాడ్ లో నటించింది. ఆ టైం లోనే ఆమెని హీరోయిన్ గా చేయమని సలహా ఇచ్చారట నాగార్జున.

ఆయన సలహాతోనే గీతిక సినిమాల్లో నటించాలని ఫిక్స్ అయ్యిందట. మొదటి సినిమానే ఓ వారసుడి సినిమాలో నటిస్తుండగా గీతికకు వరుస ఆఫర్లు రావడం పక్కా అని అంటున్నారు. అహింస హిట్టై.. మహేష్ సినిమాలో ఛాన్స్ పట్టేస్తే మాత్రం టాలీవుడ్ కి మరో స్టార్ హీరోయిన్ దొరికేసినట్టే అని ఫిక్స్ అవ్వొచ్చు.

ఇప్పటికే అహింస లో గీతిక పర్ఫార్మెన్స్ గురించి ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. అహింసలో ఆమె నటన ప్రేక్షకుల మనసులు గెలిస్తే మాత్రం అమ్మడి దశ తిరిగినట్టే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.