Begin typing your search above and press return to search.

ర‌వితేజ‌ను తేజ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మేనా?

By:  Tupaki Desk   |   24 Nov 2022 7:30 AM GMT
ర‌వితేజ‌ను తేజ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మేనా?
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ ని ద‌ర్శ‌కుడు తేజ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే. వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేయ‌క‌పోయినా.. ఒకే సారి త‌మ త‌మ సినిమాల‌తో పోటీకి దిగుతున్నారు. ఆ పోటీలో మాస్ రాజా ర‌వితేజ‌ని తేజ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. మాస్ మ‌హారాజా ర‌వితేజ 'రామారావు ఆన్ డ్యూటి' త‌రువాత చేస్తున్న సినిమా 'ధామాకా'. త్రినాథ‌రావు న‌క్కిన డైరెక్ష‌న్ లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ ల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన 'జింతాక్‌' సాంగ్ నెట్టింట వైర‌ల్ గా మారి 34 మిలియ‌న్ వ్యూస్ ని క్రాస్ చేసింది. మ‌రో రెండు పాటలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. రీ షూట్ ల‌తో రిలీజ్ ఆల‌స్యం అవుతూ వ‌స్తున్నీ మూవీ రిలీజ్ ఎట్ట‌కేల‌కు ఫిక్స‌యింది. ఈ మూవీని డిసెంబ‌ర్ 23న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ఇదే రోజున తేజ తెర‌కెక్కిస్తున్న 'అహింస‌' కూడా రిలీజ్ కు రెడీ అవుతున్న‌ట్టుగా తెలుస్తోంది. వ‌రుస ఫ్లాపుల త‌రువాత 'నేనే రాజు నేనే మంత్రి' మూవీతో బౌన్స్ బ్యాక్ అయిన తేజ ఆ త‌రువాత 'సీత‌'తో భారీ డిజాస్ట‌ర్ ని సొంతం చేసుకుని షాకిచ్చాడు.

దీంతో తేజ మ‌ళ్లీ ట్రాక్ త‌ప్పాడు. ఎలాగైనా మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ కావాల‌ని దాదాపు రెండున్న‌రేళ్ల త‌రువాత 'అహింస‌'తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ద్వారా డి. సురేష్ బాబు త‌న‌యుడు అభిరామ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే.

సినిమా ఎప్పుడో పూర్త‌యింది. మధ్య ప్ర‌దేశ్ లోని మారు మూల గ్రామాల్లో ఈ మూవీని తెర‌కెక్కించారు. దీంతో నేటివిటీ మిస్స‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అంతే కాకుండా తేజ త‌న ఓల్డ్ ఫార్మాట్ ని న‌మ్ముకుని ఈ మూవీని చేసిన‌ట్టుగా టీజ‌ర్ ని బ‌ట్టి తెలుస్తోంది. అంతే కాకుండా నేటి ప్రేక్ష‌కుల నాడిని ప‌ట్టుకునే క్ర‌మంలో ఈ మూవీకి సంబంధించిన చాలా వ‌ర‌కు రీ షూట్ లు చేశార‌ట‌. సినిమా కు సంబంధించి అన్ని కార్యక్ర‌మాలు పూర్త‌య్యాయి.

అయితే ఇంత వ‌ర‌కు చిత్ర బృందం రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించ‌లేదు. మంచి టైమ్ చూసుకుని రిలీజ్ చేయాల‌నే భావ‌న‌లో తేజ వున్నాడు. అభిరామ్ ని హీరోగా కాకుండా ఓ న‌టుడిగానే ట్రీట్ చేస్తున్న తేజ కంటెంట్ ని బ‌లంగా న‌మ్ముతూ ఈ మూవీని చేశానంటున్నాడు. ఫైన‌ల్ గ ఈ మూవీని డిసెంబ‌ర్ 23నే విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది. అదే రోజు ర‌వితేజ 'ధ‌మాకా' రిలీజ్ అవుతోంది. ర‌వితేజ సినిమా ఎలా వున్నా ఓపెనింగ్స్ గ్యారెంటీ.. ఈ పోటీలో మాస్ రాజా ని త‌ట్టుకోవ‌డం తేజ‌కు క‌ష్ట‌మ‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఏం జ‌ర‌గ‌నుంద‌న్న‌ది తెలియాలంటే డిసెంబ‌ర్ 23 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.