Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్ట‌ర్ యాక్సిడెంట్ పై అనుమానాలు

By:  Tupaki Desk   |   25 Jan 2020 10:58 AM IST
స్టార్ డైరెక్ట‌ర్ యాక్సిడెంట్ పై అనుమానాలు
X
ఇటీవ‌ల వ‌రుస రొడ్డు ప్ర‌మాదాలు సెల‌బ్రిటీల్ని క‌ల‌వ‌ర‌పెడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రోడ్ టెర్ర‌ర్ భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. కార్ జ‌ర్నీ ప్ర‌మాదాలు...అనుకోకుండా వెనుక నుంచి వాహ‌నాలు దూసుకొచ్చి ఢీ కొట్టేయ‌డం వంటి ఘ‌ట‌న‌ల‌తో టాలీవుడ్ ఒణికిపోతోంది. ఇటీవ‌లే స‌ప్త‌గిరి ఎల్.ఎల్.బి ద‌ర్శ‌కుడు చ‌ర‌ణ్ ల‌క్కాకుల ను ఫిల్మ్ న‌గ‌ర్ లో వెన‌క నుంచి కారు డ్యాష్ ఇచ్చింది. తృటిలో ప్రాణాపాయం త‌ప్పి తీవ్ర గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ ఘ‌ట‌నను మ‌రువ‌క ముందే మ‌రో ద‌ర్శ‌కుడి ని ఓ వ్య‌క్తి బైక్ పై వ‌చ్చి డ్యాష్ ఇచ్చి ప‌రార‌వ్వ‌డం సంచ‌ల‌న‌మైంది.

యాక్సిడెంట్ లో స‌ద‌రు ద‌ర్శ‌కుడి భుజం ఎముక‌ విరిగింది. కాళ్ల‌కు.. ఇత‌ర శ‌రీర‌భాగాల‌కు తీవ్రంగానే దెబ్బ‌లు త‌గిలాయి. ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే... త‌మిళ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్.. నా పేరు శివ ఫేం సుశీంద్ర‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితం. కార్తీ- విశాల్ వంటి హీరోల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆయ‌న స‌క్సెస్ రేంజు కు స్టార్ హీరోలు సైతం అత‌నితో ప‌నిచేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఊహించ‌ని రీతిలో ఆయ‌న కు యాక్సిడెంట్ జ‌రిగింది. శుక్ర‌వారం ఉద‌యం వాకింగ్ కు వెళ్తుండ‌గా బైక్ లో వ‌చ్చిన ఓ వ్య‌క్తి సుశీంద్ర‌న్ ని బ‌లంగా ఢీ కొట్టాడు.

దీంతో కింద ప‌డి పోయిన సుశీంద్ర‌న్ కు తీవ్ర గాయాల‌య్యాయి. ఆయ‌న్ని వెంట‌నే ఆసుప‌త్రి కి త‌ర‌లించి చికిత్స చేయించారు. చేయి విరిగింది. మిగ‌తా భాగాల‌కు గాయాలు తీవ్రంగా ఉండటంతో వారం పాటు ఆసుప‌త్రి లోనే చికిత్స తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచించారు. యాక్సిడెంట్ పై పోలీసులు కేసు న‌మోదు చేసారు. సుశీంద్ర‌న్ ని కావాల‌నే ప్లాన్ చేసి స‌ద‌రు అప‌రిచితుడు ఢీ కొట్టాడా? లేక ప్ర‌మాద‌వ‌ శాత్తూ జ‌రిగిన‌దేనా? లేక ఇది హ‌త్యా య‌త్నమా? అన్న కోణం లో విచార‌ణ చేస్తున్న‌ట్లు స‌మాచారం.