Begin typing your search above and press return to search.

సూరి.. ఆ మెగా ఆఫర్ పట్టేసినట్లేనా?

By:  Tupaki Desk   |   12 Dec 2016 11:03 AM GMT
సూరి.. ఆ మెగా ఆఫర్ పట్టేసినట్లేనా?
X
ధృవ సక్సెస్ ఫుల్ వెంచర్ దిశగా పరుగులు తీస్తుండడంతో ఇప్పుడు అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యే వ్యక్తి దర్శకుడు సురేందర్ రెడ్డి. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన మూవీని హ్యాండిల్ చేయడం అంటే.. చిన్న విషయం కాదు. ఒరిజినల్ ను ఏ మాత్రం మార్చకుండా తన స్టైల్ లో స్క్రీన్ ప్లే కి రేసింగ్ టచెస్ ఇచ్చి.. పర్ఫెక్ట్ థ్రిల్లర్ ని అందించిన సురేందర్ రెడ్డి.. ధృవ ప్రమోషన్స్ లో.. గీతాఆర్ట్స్ తో మరోసారి వర్క్ చేయబోతున్నట్లు చెప్పాడు.

ఇప్పుడీ ప్రాజెక్ట్ కన్ఫాం అయిపోయినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ తో మరో సినిమాకి సైన్ చేసేశాడట సూరి. అయితే.. ఇది మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నాడనేదే అసలైన హైలైట్. మెగాస్టార్ కోసం కథ రెడీ చేస్తున్న విషయం ఇప్పటికే రివీల్ చేసిన సురేందర్ రెడ్డికి.. మంచి స్టోరీతో రావాల్సిందిగా చెప్పాయట గీతా ఆర్ట్స్ వర్గాలు. చిరంజీవి 150వ సినిమా రిలీజ్ తర్వాత 151వ సినిమాని దాదాపుగా అల్లు అరవింద్ కే చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.

ఈ ఈక్వేషన్స్ ప్రకారం.. సురేందర్ రెడ్డి చెప్పిన కథ కనుక నచ్చితే మెగా 151కి డైరెక్టర్ ఆఫర్ సురేందర్ రెడ్డికే దక్కే అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే మాత్రం స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి మరింతగా పెరిగిపోయినట్లే.