Begin typing your search above and press return to search.

రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   29 Feb 2020 4:15 PM IST
రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు
X
సినీ నటుడు రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తమిళ సినీ దర్శకుడు సంచలన కామెంట్స్ చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తొలి సమావేశంలోనే చనిపోతారని తెలిపి అందర్నీ ఆందోళనలో పడేశారు. రజనీకాంత్ ఆరోగ్యం బాగా లేదని ఆయన చెబుతూనే రజనీకాంత్ సినిమా తీరుపై విమర్శలు చేశారు. ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో తమిళనాడులో పెద్ద దుమారం రేగింది. రజనీకాంత్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.

రాజకీయాల్లోకి ఎప్పటి నుంచో రావాలని ఎదురుచూస్తున్న సినీ నటుడు రజనీకాంత్. అయితే ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి రాకున్నా తరచూ తాజా పరిణామాలపై స్పందిస్తున్నారు. ఆయన రాజకీయ ప్రవేశంతో పాటు తమిళనాడులో ఉన్న పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివంగత జయలలిత జయంతి వేడుకల్లో సుందరరాజన్ ఆ విధంగా వ్యాఖ్యనించి విమర్శలపాలవుతున్నాడు. అన్నాదురై ముఖ్యమంత్రి అయినప్పుడు టీచర్లు చాలా సంతోషించారు. ఎందుకంటే సీఎం అవడానికి ముందు అన్నాదురై కూడా టీచర్ ప్రొఫెషన్‌లోనే ఉన్నారు. కానీ టీచర్లు ఎవరూ ఆయన్ను ఫాలో అయ్యి సీఎం అవ్వాలని అనుకోలేదని తెలిపాడు. కానీ ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో చాలా మంది తమకున్న అర్హతలు ఏమిటో కూడా చూసుకోకుండా సినిమాల్లోకి వచ్చేయాలని నిర్ణయించేసుకున్నారని పరోక్షంగా కొందరినీ ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా రజనీకాంత్ వ్యవహార శైలిపై స్పందిస్తూ... రజినీకాంత్ పార్టీ పెట్టి కోయింబత్తూరు లో తొలి సమావేశం నిర్వహిస్తే తిర్పూరు చేరుకునే లోపే రజనీ చచ్చిపోతాడని, ఆయన శరీరం అంత ఆందోళనకరంగా ఉంది మరి అని చెప్పి అందరిలో కలవరం రేపాడు. రజనీకాంత్ ఆరోగ్యం బాగా లేదని చెప్పడంతో రజనీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు సినిమా తీరుపై సుందర రాజన్ మాట్లాడారు. ఎంజీఆర్ తన సినిమాలోని విలన్లను ఎప్పుడూ చంపలేదు. కానీ రజినీకాంత్, విజయ్, అజిత్ లాంటి నటులు తమ సినిమాల్లోని విలన్స్‌ని ఎప్పుడూ చంపాలనే చూశారని వివరించారు. . రాజు పాత్ర కూడా కేవలం ఎంజీఆర్‌కే సరిపోయిందిని ఆ గెటప్ రజనీ, అజిత్, విజయ్ తదితరులు వేస్తే అసహ్యంగా ఉండేవారని పేర్కొన్నారు. అలాంటిది ఎంజీఆర్ కూర్చున్న సీటులో వీళ్లంతా కూర్చోవాలన్న ఆలోచన కూడా ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదని సందేహాం వ్యక్తం చేశారు. అంటే సీఎం కుర్చీలో కూర్చునే అర్హత వారందరికీ లేదని ఆయన పరోక్షంగా తెలిపారు. ఇక స్టాలిన్, కరుణానిధిలపై సుందర రాజన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.