Begin typing your search above and press return to search.

పుష్ప సెట్లో క‌రోనా .. స్వీయ‌నిర్భంధంలో సుక్కూ

By:  Tupaki Desk   |   3 Dec 2020 12:05 PM GMT
పుష్ప సెట్లో క‌రోనా .. స్వీయ‌నిర్భంధంలో సుక్కూ
X
పుష్ప టీమ్ స‌డెన్ బాంబ్ పేల్చింది. సెట్లో ప్రొడ‌క్ష‌న్ టీమ్ కార్మికునికి క‌రోనా సోకి మ‌ర‌ణించ‌డంతో సడెన్ గా షూటింగ్ నిలిపి వేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇది ఊహించ‌ని ట్విస్ట్. ఈ ప‌రిణామం సుక్కూని తీవ్రంగా నిరాశ‌ప‌రిచింద‌ట‌. చాలా గ్యాప్ త‌ర్వాత షూటింగ్ మొద‌లు పెడితే స‌డెన్ గా ఇలా అవ్వ‌డం అత‌డు డైజెస్ట్ చేసుకోలేక‌పోయార‌ని గుస‌గుసలు వినిపించాయి.

అయితే స‌ద‌రు ప్రొడ‌క్ష‌న్ కార్మికుడు అల్లు అర్జున్ తో ద‌గ్గ‌ర‌గా సంభాషించ‌లేదు. కానీ సుకుమార్ అండ్ టీమ్ కి చేరువ‌గా వెళ్లాడు. అందుకే వీరంతా స్వీయ నిర్భంధంలోకి వెళ్లార‌ని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ‌లోని మారేడుమిల్లి అడ‌వుల్లో షూటింగ్ చేస్తుండ‌గా ప్రొడ‌క్ష‌న్ కార్మికుడు చిత్ర‌ బృందంలోని సిబ్బందితో కలిసిపోయి ప‌ని చేశారు. అందుకే ఆ బృందం షూట్ రద్దు చేసి వెంట‌నే హైదరాబాద్ నగరానికి చేరుకుంది. ఇక బ‌న్ని నేరుగా ఆ కార్మికునితో మాట్లాడ‌క‌పోయినా కానీ అతను సెట్స్ లో పనిచేస్తున్నప్పుడు మిగతా బృందం అతనితో సంభాషించింది.

దర్శకుడు సుకుమార్ ప్ర‌స్తుతం ఏకాంతంలోకి వెళ్ళాడని .. వారం తరువాత మళ్లీ ఆయ‌న‌కు క‌రోనా టెస్ట్ నిర్వ‌హిస్తార‌ని స‌న్నిహిత‌ వర్గాలు చెబుతున్నాయి. చిత్ర నిర్మాతలు కూడా హైదరాబాద్ కు తిరిగి వచ్చిన వెంటనే క‌రోనా టెస్టులు చేయించుకున్నార‌ని స‌మాచారం. అయితే కోవిడ్ సోకిందా లేదా అని తెలుసుకోవడానికి వారం పాటు వేచి ఉండాల్సి ఉంటుంది.