Begin typing your search above and press return to search.

సాహో ద‌ర్శ‌కుడి నిశ్చితార్థ వెన్యూ ఇదే!

By:  Tupaki Desk   |   7 Jun 2020 4:37 AM GMT
సాహో ద‌ర్శ‌కుడి నిశ్చితార్థ వెన్యూ ఇదే!
X
టాలీవుడ్ లో ఒక్కొక్క‌రుగా ఓ ఇంటివాళ్లు అయ్యేందుకు రెడీ అవుతున్నారు. నిఖిల్- నితిన్ - రానా .. ఇలా వ‌రుస‌గా పెళ్లి బాజాల‌కు సిద్ధ‌మ‌వ్వ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఇక ఇదే బాట‌లో యువ‌ద‌ర్శ‌కుడు సుజీత్ ఓ ఇంటివాడ‌వుతున్నాడు. తాను ప్రేమించిన డాక్ట‌ర్ కం రైట‌ర్ ప్ర‌వ‌ళ్లిక‌ను పెళ్లాడేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇరువైపులా పెద్ద‌ల అంగీకారంతో ఈ వివాహం జ‌ర‌గ‌నుంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ జంట‌ నిశ్చితార్థం హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్ లో జరుగ‌నుంది. జూన్ 10 ఉదయం 9 గంటలకు నిశ్చ‌య తాంబూలాలకు ముహూర్తం నిర్ణ‌యించారు. లాక్ డౌన్ నియ‌మం ప్ర‌కారం.. యువ జంటను ఆశీర్వదించడానికి కుటుంబ సభ్యులు.. ఇరువైపుల స్నేహితులతో సహా 50 మంది అతిథులు మాత్రమే విచ్చేయ‌నున్నారు. అటుపై వివాహ ముహూర్తం ఫిక్స్ చేయ‌నున్నారు. సుజీత్ కి కాబోయే భార్య దంత వైద్యురాలు.. స్క్రీన్ ప్లే ర‌చ‌యిత‌. ల‌వ్ కం ఎరేంజ్డ్ మ్యారేజ్ జ‌ర‌గనుంది.

ఇక సుజీత్ కెరీర్ సంగ‌తి ప‌రిశీలిస్తే.. సాహో లాంటి భారీ పాన్ ఇండియా చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించి సంచ‌ల‌న‌మే అయ్యాడు సుజీత్. కెరీర్ రెండో ప్ర‌య‌త్న‌మే ఇంత భారీ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అరుదైన అవ‌కాశం ద‌క్కించుకున్న ల‌క్కీ గ‌య్ అంటూ ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఆ సినిమా రిజ‌ల్ట్ సంగ‌తి ఎలా ఉన్నా.. టెక్నిక‌ల్ వండ‌ర్ గా తీర్చిదిద్దాడ‌ని ఇంత చిన్న వ‌య‌సులో అసాధార‌ణ ప్ర‌య‌త్నం చేశాడ‌ని ప్ర‌శంసించిన వారు ఉన్నారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా లూసీఫ‌ర్ రీమేక్ ని సుజీత్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ని గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం సాగుతోంది.