Begin typing your search above and press return to search.
ఆ విషయమై వారికి రాజమౌళి ఫుల్ క్లాస్.. ‘ఆర్ఆర్ఆర్’ షెడ్యూల్డ్ టైమ్‌కు వచ్చేనా..!
By: Tupaki Desk | 5 Aug 2021 4:00 PM ISTటాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ‘బాహుబలి’ ఫిల్మ్‌తో తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూవీ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన సీన్ల తుది దశ చిత్రీకరణ కోసం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ విదేశాలకు వెళ్లింది. కాగా, తాజాగా ఓ విషయమై దర్శకధీరుడు రాజమౌళికి వారికి ఫుల్ క్లాస్ పీకడంతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చారట.
‘బాహుబలి’ టూ పార్ట్స్ తర్వాత రాజమౌళి కొంత కాలం గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఫిల్మ్ అనుకున్న సమయానికి అనగా అక్టోబర్ 13న విడుదల చేసేందుకుగాను మూవీ యూనిట్ శ్రమిస్తోంది. సినిమా చివరి షెడ్యూల్ కోసం యూనిట్ సభ్యులు విదేశాలకు వెళ్లారు. ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ పట్ల కూడా రాజమౌళి అత్యంత జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓన్లీ డైరెక్టర్ గా మాత్రమా కాకుండా సినిమా ప్రమోషన్ పట్ల కూడా రాజమౌళి ఫుల్ కాన్సంట్రేట్ చేస్తుండటం గురించి మనందరికీ తెలుసు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ సింగిల్ ‘దోస్తీ’కి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగానే ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన పలు విషయాల గురించి నటీనటులు కానీ సాంకేతిక నిపుణలు కానీ ఎక్కడా ప్రస్తావించొద్దని రాజమౌళి చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా టెక్నీషియన్స్ రాజమౌళి ఫుల్ క్లాస్ పీకారని సమాచారం. మీడియాతో సంభాషించే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారట జక్కన్న. చిత్రానికి సంబంధించిన చిన్న సమాచారం కూడా బయటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారని వినికిడి.
ఈ చిత్రషూటింగ్ ఫొటోలు కొన్ని గతంలో లీక్ కాగా, అలాంటివి రిపీట్ కాకుండా రాజమౌళి అలర్ట్ గా ఉంటున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పని షూటింగ్ తర్వాతనే మూవీ యూనిట్ మొత్తానికి రాజమౌళి తెలిపారని తెలుస్తోంది. సినిమా పలు భాషల్లో విడుదలవుతున్న సందర్భంగా ఒక్కో భాషలో ఎలా సినిమాను ప్రమోట్ చేయాలి? ఎవరెవరి సహకారం ఎప్పుడు తీసుకోవాలి? అనే అంశాలపై రాజమౌళి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారట. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్‌కు ఈ విషయాలను గురించి వివరించినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తుండగా ఆయన సహకారంతో బాలీవుడ్ లో ప్రమోషనల్ యాక్టివిటిస్ ఉండబోతున్నట్లు వినికిడి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతీ ప్రమోషన్ ఈవెంట్ లో పార్టిసిపేట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక మూవీ మ్యూజిక్‌కు సంబంధించి కూడా ఇంతకు ముందులా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉండేలా ఆలోచిస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. చిత్రంలో రామ్ చరణ్ సరసన ఆలియాభట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలివియా నటిస్తోంది.