Begin typing your search above and press return to search.

రజినీని ఊరమాస్ యాంగిల్ లో చూపిస్తానంటున్న శివ..

By:  Tupaki Desk   |   2 April 2020 3:30 AM GMT
రజినీని ఊరమాస్ యాంగిల్ లో చూపిస్తానంటున్న శివ..
X
భారతీయ సినీ చరిత్రలో స్టైల్ కి పెట్టింది పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన నడకలో, మాటలో, చూపులో, డాన్సులో, ఫైట్స్, యాక్షన్ లో ఏది చేసినా స్టైల్ గానే ఉంటాయి. సూపర్ స్టార్ తలైవర్.. అప్పటి నాటి హీరోల నుండి నేటి యంగ్ హీరోలకు సైతం పోటీగా నిలుస్తూ వస్తున్నాడు. తలైవర్ సినిమా అంటేనే అభిమానులలో ఎక్కడలేని ఊపు కన్పిస్తుంది. స్టైలుతో కోట్లాది అభిమానులను సంపాదించుకొని నేటికీ హీరోగా థియేటర్లలో దుమ్మురేపుతున్న రికార్డ్ సృష్టిస్తుంది కేవలం రజిని ఒక్కడే. ఇటీవలే 'దర్బార్' సినిమా విజయంతో ఊపులో ఉన్న రజిని ప్రస్తుతం 'శంఖం' ఫేమ్ శివ దర్శకత్వంలో తన 168వ సినిమాను పూర్తిచేస్తున్నాడు.

డైరెక్టర్ శివ తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. హీరోయిజంను చూపించడంలో శివకి ప్రత్యేక శైలి ఉంది. మాస్, క్లాస్ ఎలాంటి ప్రేక్షకుడినైనా మెప్పించే సత్తా ఉన్న దర్శకుడిగా ఇండస్ట్రీలో శివకి మంచి పేరుంది. ఇప్పటికే తలా అజిత్ తో వరుస బ్లాక్ బస్టర్లను రూపొందించి విశేషంగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. అలాంటిది సూపర్ స్టార్ రజినిని ఏ రేంజ్ లో చూపిస్తాడో అని తలైవర్ అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రజినీకి తోడు మాజీ బ్యూటీలు ఖుష్బూ - మీనాలు నటిస్తుండగా, మహానటి కీర్తిసురేష్ కీలక పాత్రను పోషిస్తుంది. రజినీతో రోబో సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. సన్ పిక్చర్స్ అంటేనే సినిమా భారీ బడ్జెట్ తో గ్రాండియర్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది. మొదటిసారి శివ-రజినిల కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సినీ వర్గాలలో ఆసక్తి నెలకొంది.