Begin typing your search above and press return to search.

మాస్ డైరెక్ట‌ర్ తో సూప‌ర్ స్టార్ క‌న్ఫామ్

By:  Tupaki Desk   |   11 Oct 2019 9:58 AM GMT
మాస్ డైరెక్ట‌ర్ తో సూప‌ర్ స్టార్ క‌న్ఫామ్
X
`ద‌రువు` శివ గురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇక్క‌డ ర‌వితేజ‌కు `ద‌రువు` రూపంలో ఫ్లాప్ ని ఇచ్చినా ఈ తెలుగు కుర్రాడు త‌మిళంలో మాత్రం బంప‌ర్ హిట్ డైరెక్ట‌ర్. అక్క‌డ ఏకంగా త‌ళా అజిత్ కి వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు ఇచ్చాడు. వేదాళం.. వివేకం.. విశ్వాసం వంటి మాస్ సినిమాల‌తో శివ‌కు అజిత్ ఫ్యాన్స్ లో ప్ర‌త్యేక‌మైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

అయితే అత‌డు త్వ‌ర‌లోనే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ను డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం అవుతోంది. శివ ఇప్ప‌టికే ర‌జ‌నీకి క‌థ వినిపించాడని అయితే ఫైన‌ల్ కావాల్సి ఉంద‌ని ప్ర‌చార‌మైంది. అయితే అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ మాత్రం రాలేదు.

తాజాగా దానిపై స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. ర‌జ‌నీ త‌దుప‌రి సినిమాని నిర్మించేందుకు సిద్ధ‌మ‌వుతున్న స‌న్ పిక్చ‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీతో ఎంథిర‌న్- పేట లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను రూపొందించాం. తిరిగి స‌న్ పిక్చ‌ర్స్ అత‌డితో సినిమా చేస్తోంది.. త‌లైవార్ 168 మా బ్యాన‌ర్ సినిమా.. అంటూ ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. డైరెక్ట‌ర్ శివ పేరును ప్ర‌త్యేకించి మెన్ష‌న్ చేశారు. మొత్తానికి తెలుగు కుర్రాడు అనుకున్న‌ది సాధించాడు. అంత పెద్ద క్రేజీ ఆఫ‌ర్ అందుకుని అర‌వ తంబీల న‌డుమ‌ స‌త్తా చాటుతున్నాడు. శివ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా అత‌డు ర‌జ‌నీని కూడా మాస్ అవ‌తారంలోనే చూపిస్తార‌న‌డంలో సందేహం లేదు. ర‌జ‌నీ ప్ర‌స్తుతం మురుగ‌దాస్ తో ద‌ర్బార్ చిత్రాన్ని పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. త‌దుప‌రి త‌లైవార్ 168 సెట్స్ పైకి వెళుతుంది.