Begin typing your search above and press return to search.
సమంత దెబ్బకి మరో హీరోను వెతుక్కుంటున్న శివ నిర్వాణ
By: Tupaki Desk | 23 Jan 2023 7:00 AM ISTనిన్ను కోరి సినిమాతో డైరెక్టర్‌గా మారిన శివ నిర్వాణ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నాగచైతన్య సమంత కాంబినేషన్లో తెరకెక్కిన మజిలీ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే మూడో ప్రయత్నంలో ఆయన చేసిన టక్‌జగదీష్ సినిమా... డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడమే కాక ఇదేంటి ఇలాంటి సినిమా తీశాడు అని అనిపించుకునేలా కూడా చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా తెలుగు వాళ్ళకి నచ్చకపోయినా తమిళ్ ప్రేక్షకులకు నచ్చుతుందేమో అన్నట్లుగా ఈ సినిమాని తమిళంలో అధర్వ మురళి హీరోగా రీమేక్ చేశారు.
ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఆయన ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా తెరకెక్కున్న ఈ సినిమా షూటింగ్ కొంత పూర్తయింది. అయితే సమంత అనారోగ్యం బారిన పడడంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సమంత ముందే డేట్లు ఇచ్చిన ఒక వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ముంబై వెళ్ళింది కానీ.. ఈ ఖుషి సినిమా షూటింగ్లో ఎప్పుడు పాల్గొంటుందనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు.
సమంత నుంచి సరైన సమాధానం కూడా లేకపోవడంతో ఇప్పుడు ఈ నిన్ను కోరి దర్శకుడు... హీరో నితిన్‌ని కలిసి కొత్త సినిమా కోసం కథ వినిపించినట్లుగా తెలుస్తోంది.ఒక రకంగా సినిమా మధ్య గ్యాప్ వస్తే దర్శకులు ఆ సినిమా మీదే ఫోకస్ పెడుతూ ఉంటారు. కానీ శివ నిర్వాణ ప్రాజెక్టు మొదలు పెట్టేముందే బౌండెట్ స్క్రిప్ట్‌తో అన్నివిధాలుగా సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఖుషి సినిమా మీద దృష్టి పెట్టకుండా తర్వాత ప్రాజెక్టు మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నితిన్‌ని ఒప్పించి ఒక సినిమా సెట్ చేసుకునే పనిలో ఆయన ఉన్నారని ప్రచారం జరుగుతోంది. నితిన్ కూడా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. చివరిగా మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో నితిన్ భారీ డిజాస్టర్ అందుకున్నాడు. దీంతో శివ నిర్వాణ లాంటి దర్శకుడుతో ఒక మంచి లవ్‌స్టోరీ పడితే నితిన్ మళ్ళీ సెట్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహంలేదు.