Begin typing your search above and press return to search.

#సుశాంత్ డెత్ మిస్ట‌రీపై ఫ్యామిలీ.. సాటి స్టార్ల అనుమానాలు

By:  Tupaki Desk   |   16 Jun 2020 4:45 AM GMT
#సుశాంత్ డెత్ మిస్ట‌రీపై ఫ్యామిలీ.. సాటి స్టార్ల అనుమానాలు
X
ప్ర‌స్తుతం అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఒక‌టే హాట్ టాపిక్. వ‌ర్థ‌మాన న‌టుడు.. ప్ర‌తిభావంతుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (34) ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి తెర‌వెన‌క కార‌ణాలేమిటి?..‌. ఇది ఆత్మ‌హ‌త్య‌నా లేక ఇంకేదైనా కుట్ర జ‌రిగిందా? అంటూ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇది ఆత్మ‌హ‌త్య.. డిప్రెష‌న్ లో క్ష‌ణికావేశంలో జ‌రిగిన త‌ప్పిదం! అని పోలీసులు ధృవీక‌రించినా ఇంకా సందేహాలు అలానే ఉన్నాయి.

సుశాంత్ సింగ్ వ్య‌క్తిగ‌త పీఏ (మేనేజ‌ర్) ఐదారు రోజుల క్రితం ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం.. అనంత‌ర ప‌రిణామాలు సందేహం క‌లిగించేవిగా ఉన్నాయి. అత‌డి హెయిర్ స్టైలిస్ట్.. మేక‌ప్ ఆర్టిస్ట్.. సాటి న‌టీన‌టులు అంతా సుశాంత్ వెన‌క ఏం జ‌రిగిందో తెలుసు! అంటూ వ్యాఖ్యానించ‌డం చూస్తుంటే అత‌డిపై ఏదో కుట్ర జ‌రిగిందా? అత‌డిని ప‌రిశ్ర‌మ‌లో ఒంట‌రిని చేయ‌డం ద్వారా తీవ్ర‌మైన ఒత్తిడికి గుర‌య్యేలా చేశారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తాజాగా ఆ కుట్ర కోణంపై సుశాంత్ సింగ్ స‌న్నిహిత న‌టుడు బాలీవుడ్ దర్శక నిర్మాత శేఖర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ కి ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణమైన వ్యక్తులు తనకు తెలుసున‌ని ఆయ‌న కామెంట్ చేయ‌డం వేడెక్కిస్తోంది. ``సుశాంత్ నువ్వు పడ్డ బాధ తెలుసు. నిన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తుల గురించి తెలుసు. వారి వేధింపులు భరించలేక నువ్వు నా భుజాలపైపడి కన్నీరు పెట్టుకున్నావు. ఆరు నెలలుగా నేను నీకు దగ్గరగా ఉండి ఉంటే ఇలా జ‌రిగేది కాదు. క‌నీసం నువ్వు నన్ను కలిసి ఉన్నా బాగుండేది. నీకు ఇలా జరగడం వారి కర్మ.. నీది కాదు సుశాంత్`` అంటూ ఎంతో ఉద్వేగంగా ట్వీట్ చేశారు శేఖ‌ర్ క‌పూర్.

ఇది ఆత్మహత్య కాదు హత్యేన‌ని.. సీబీఐ ద‌ర్యాప్తు జ‌ర‌గాల‌ని సుశాంత్ అభిమానులు డిమాండ్ చేయ‌గా.. సుశాంత్ మేన‌మామ‌.. అలాగే అత‌డి బావ అయిన ఓపీ సింగ్ ఇది హ‌త్య అని వ్యాఖ్యానించ‌డం అనుమానం వ్యక్తం చేయ‌డం వేడెక్కిస్తోంది. అయితే సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని పోస్ట్ మార్టం నివేదిక‌లు అందాయి. అయినా ఉరి వేసుకోవ‌డానికి ముందు ఏదైనా విష ప్ర‌యోగం జ‌రిగిందా? అన్న కోణంలోనూ పోలీస్ విచార‌ణ సాగుతోంది. అత‌డి అవ‌య‌వాల్ని జేజే ఆసుప‌త్రికి పంపి ల్యాబులో టెస్ట్ చేస్తున్నారు. శేఖ‌ర్ క‌పూర్ వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి.. సుశాంత్ మేన‌మామ వ్యాఖ్యల్ని బ‌ట్టి ఇది హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా? అన్న సందేహాలు ఇంకా స‌జీవంగా ఉన్నాయి. మ‌రోవైపు ప్రియురాలితో ప్రేమ వైఫ‌ల్యం కూడా ఈ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మై ఉంటుందా? ఆర్థిక కార‌ణాలేవైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం రియా చక్ర‌వ‌ర్తి స‌హా స్నేహితుల్ని పోలీసులు విచారిస్తున్నారు.