Begin typing your search above and press return to search.

శంకర్‌ను మెస్మరైజ్ చేసిన బాహుబలి

By:  Tupaki Desk   |   14 July 2015 5:30 PM IST
శంకర్‌ను మెస్మరైజ్ చేసిన బాహుబలి
X
దక్షిణాది వరకు భారీ బడ్జెట్ సినిమా అంటే అందరికీ తమిళ దర్శకుడు శంకరే గుర్తుకొస్తాడు. ఇక్కడి దర్శకులంతా సాహసాలకు దూరంగా సేఫ్‌గా సినిమాలు తీసుకుంటుంటే.. శంకర్ వచ్చి సౌత్ ఇండియన్ స్క్రీన్‌ను రంగుల మయం చేశాడు. ఇక్కడి మార్కెట్‌ను విశ్వవ్యాప్తం చేశాడు. అందులో గత దశాబ్ద కాలంలో శంకర్ తీసిన అపరిచితుడు, రోబో, ఐ సినిమాలో అంతర్జాతీయ స్థాయిలో అతడి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా రోబో, ఐ అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కి బాలీవుడ్ జనాల్ని కూడా విస్తుపోయేలా చేశాయి. బాలీవుడ్ జనాలందరూ కూడా శంకర్‌ను గౌరవించడం మొదలుపెట్టారు.

ఐతే గత వారం రోజులుగా శంకర్‌ పేరు మరిచిపోయి మన రాజమౌళి పేరే పలవరిస్తున్నారు. భారీ తనానికి సరికొత్త కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన రాజమౌళి.. శంకర్‌ను మించి పేరు తెచ్చుకున్నాడు. అసలింతకీ రాజమౌళి తీసిన సినిమా మీద శంకర్ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని అందరిలోనూ ఆసక్తి ఉండటం సహజం. ఆ గ్రేట్ డైరెక్టర్ కూడా మనోడి సినిమా చూశాడు. మెస్మరైజ్ అయిపోయాడు. ట్విట్టర్లోకి వచ్చి తన స్పందన కూడా తెలియజేశాడు. బాహుబలి చూసి విస్తుపోయినట్లు శంకర్ చెప్పాడు. ‘‘బాహుబలి.. ఎపిక్ థాట్స్, పొయెటిక్ ఇమేజినేషన్.. బలమైన పాత్రచిత్రణ.. అదిరిపోయే హీరోయిజం.. విస్మయపరిచే విజువల్స్.. వావ్.. రాజమౌళి, అతడి టీమ్‌కు ఛీర్స్’’ అని శంకర్ ట్వీట్ చేశాడు.