Begin typing your search above and press return to search.

యువక్రికెటర్ తో స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె పెళ్లి..!

By:  Tupaki Desk   |   26 Jun 2021 6:20 PM IST
యువక్రికెటర్ తో స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె పెళ్లి..!
X
సౌత్ ఇండియన్ అగ్రచిత్రాల దర్శకుడు శంకర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. శంకర్ పెద్దకూతురు అదితి పెళ్లి రెండు రోజుల్లో జరగనుంది. జూన్ 27న అదితి వివాహం తమిళనాడుకి చెందిన క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో జరగనుంది. ప్రస్తుతం కరోనా నిబంధనలు అమలులో ఉండటంతో పెళ్లి వేడుకలు మాములుగానే జరిపించనున్నట్లు తెలుస్తుంది. ఇరు కుటుంబ సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారట. అతికొద్ది మంది బంధువుల సమక్షంలో.. స్నేహితులు - శ్రేయోభిలాషుల మధ్యలో అదితి - రోహిత్ వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు. వీరి పెళ్లి వేడుకలు కూడా ప్రస్తుతం మహాబలిపురంలో ప్లాన్ చేశారు.

అయితే శంకర్ కూతురు అదితి ప్రొఫెషన్ పరంగా డాక్టర్. కాగా పెళ్ళికొడుకు రోహిత్ దామోదరన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టిఎన్ పీఎల్)లో క్రికెటర్ గా ఉన్నాడు. అయితే రోహిత్‌ తండ్రి రామోదరన్‌ తమిళనాడులో బడా వ్యాపారవేత్త. అలాగే తమిళనాడులోని మధురై పాంథర్స్‌ క్రికెట్ టీమ్ కు స్పాన్సర్‌ గా కూడా ఉన్నారు. ఈ ఏడాది మే నెలలో డైరెక్టర్ శంకర్‌ తల్లి ముత్తు లక్ష్మీ మరణించడంతో శంకర్ ఈ పెళ్లి ప్లాన్ చేసాడట. శంకర్ కు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుర్లు అదితి - ఐశ్వర్య. కుమారుడు అర్జీత్. మొత్తానికి పెద్దకూతురు వివాహం తర్వాత సినిమాలు తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడట శంకర్.

శంకర్ కొంతకాలంగా సినిమా వివాదాలతో సతమతం అవుతున్నాడు. ఇదివరకు ప్రారంభించిన ఇండియన్-2 (భారతీయుడు సీక్వెల్) సినిమా ఇంతవరకు పూర్తి కాలేదు. ఆల్రెడీ పలు వివాదాలతో నిలిచిపోయిన సినిమా ప్రస్తుతం కోర్ట్ ఇష్యూస్ చుట్టూ తిరుగుతుంది. గతకొన్ని నెలలుగా శంకర్ భారతీయుడు సీక్వెల్ వివాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శంకర్‌ ఇండియన్‌ 2 మూవీ వివాదం ముగిస్తే ఆ తర్వాత రామ్‌ చరణ్‌ తో ఓ పాన్‌ ఇండియా మూవి రెడీగా పెట్టుకున్నాడు. అలాగే బాలీవుడ్ లో రన్వీర్ సింగ్ తో అన్నియన్ రీమేక్ చేయనున్నాడు శంకర్. ప్రస్తుతం పెళ్లి పనులలో బిజీగా ఉన్నాడు.