Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్30 లో సెకండ్ హీరో అతడేనా?
By: Tupaki Desk | 29 April 2020 10:30 AM ISTకరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ ఆగిపోయినా కొన్ని సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం సాగుతూనే ఉన్నాయి. పలు సినిమాల కథల చర్చలు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా జరుగుతున్నాయట. ఆన్ లైన్ ద్వారా స్క్రిప్ట్ రైటింగ్ కూడా సాగుతుంది. ఎన్టీఆర్ 30వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఈ లాక్ డౌన్ టైంలో త్రివిక్రమ్ కొనసాగిస్తున్నాడట.
ఇప్పటికే ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ లు ప్రతి రోజు ఫోన్ లో మాట్లాడుకుంటూ స్క్రిప్ట్ విషయంలో చర్చించుకుంటున్నారని వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో సినిమాలో నటీనటుల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయట. అజ్ఞాతవాసి చిత్రం నుండి త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో కూడా మెయిన్ హీరోతో పాటు మరో హీరోను కూడా చూపిస్తూ వస్తున్నాడు. అజ్ఞాతవాసిలో ఆదిపినిశెట్టిని.. అరవింద సమేతలో నవీన్ చంద్రను.. అల వైకుంఠపురంలో సినిమాలో సుశాంత్ ను నటింపజేసిన విషయం తెల్సిందే.
ఇక ఎన్టీఆర్ చిత్రం కోసం కూడా ఒక యంగ్ హీరోను ఇప్పటికే త్రివిక్రమ్ ఎంపిక చేశాడట. అయితే ఆ హీరో ఎవరు అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. ఆర్‌ఎక్స్ 100 చిత్ర హీరో కార్తికేయ అంటూ కొందరు లేదు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అంటూ మరికొందరు అంటున్నారు. ట్యాలెంటెడ్ హీరోలను పట్టుకు వచ్చే త్రివిక్రమ్ ఈ చిత్రం కోసం కూడా మంచి ప్రతిభ ఉన్న యంగ్ హీరో కోసం వెదుకుతున్నాడు.. కాని ఇప్పటి వరకు ఫైనల్ కాలేదని మరికొందరు అంటున్నారు. ఈసారి సెకండ్ హీరోను చివరి వరకు రివీల్ చేయకుండా ఉంచాలని కూడా త్రివిక్రమ్ భావిస్తున్నాడట.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఇప్పట్లో ప్రారంభం అయ్యేలా కనిపించడం లేదు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంను పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ డేట్లు ఇచ్చే అవకాశం ఉందట. జులై లేదా ఆగస్టు వరకు అయినా ఈ సినిమా ప్రారంభం అయితే త్రివిక్రమ్ అన్నట్లుగా వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా విడుదలకు సాధ్యం అయ్యేను. కాని ఇంకా ఆలస్యం అయితే మాత్రం వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి వరకు ఎన్టీఆర్ 30 కోసం వెయిట్ చేయాల్సిందే.